ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RGNAUలో డిగ్రీ, పీజీ డిప్లొమా

ABN, First Publish Date - 2022-08-08T22:32:10+05:30

కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ(Union Ministry of Civil Aviation) ఆధ్వర్యంలోని రాజీవ్‌ గాంధీ నేషనల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీ(Rajiv Gandhi National Aviation University)(సెంట్రల్‌ యూనివర్సిటీ) - డిగ్రీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ(Union Ministry of Civil Aviation) ఆధ్వర్యంలోని రాజీవ్‌ గాంధీ నేషనల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీ(Rajiv Gandhi National Aviation University)(సెంట్రల్‌ యూనివర్సిటీ) - డిగ్రీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బ్యాచిలర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీ‌స్(బీఎంఎస్‌) ఇన్‌ ఏవియేషన్‌ సర్వీసెస్‌ అండ్‌ ఎయిర్‌ కార్గో,  పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఎయిర్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌(పీజీడీఏఓ) ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు అడ్మిషన్స్‌ ఇస్తారు. 

బ్యాచిలర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (బీఎంఎస్‌) ఇన్‌ ఏవియేషన్‌ సర్వీసెస్‌ అండ్‌ ఎయిర్‌ కార్గో: లాజిస్టిక్స్‌ సెక్టర్‌ స్కిల్‌ కౌన్సిల్‌ సహకారంతో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. దీని వ్యవధి మూడేళ్లు. ఇది అప్రెంటి్‌సషి్‌్‌ప-ఎంబెడెడ్‌ డిగ్రీ ప్రోగ్రాం. మొత్తం 96 సీట్లు ఉన్నాయి. అకడమిక్‌ మెరిట్‌, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. చివరి సంవత్సరం అప్రెంటిస్‌షిప్‌ సమయంలో నెలకు రూ.9,000 స్టయిపెండ్‌గా ఇస్తారు.  

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మేథ్స్‌/ కామర్స్‌ గ్రూప్‌తో ఇంటర్‌/ పన్నెండోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.  కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. అభ్యర్థుల వయసు జూలై 31 నాటికి 21 ఏళ్లు మించకూడదు. 

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఎయిర్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌ (పీజీడీఏఓ): జీఎంఆర్‌ ఏవియేషన్‌ అకాడమీ సహకారంతో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. ప్రోగ్రామ్‌లో భాగంగా 12 నెలలు క్లాస్‌ రూం ట్రెయినింగ్‌ ఉంటుంది. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌లలో ఆర్నెల్లు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. మొత్తం 96 సీట్లు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 31 నాటికి 25 ఏళ్లు మించకూడదు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.750

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 16

వెబ్‌సైట్‌: www.rgnau.ac.in 

Updated Date - 2022-08-08T22:32:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising