ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Study Circleలో సివిల్స్‌కు శిక్షణ.. ఎవరికంటే..!

ABN, First Publish Date - 2022-07-29T20:44:37+05:30

విశాఖపట్నం(Visakhapatnam)లోని అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌(Ambedkar Study Circle) - యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సన్నద్దమౌతున్న అభ్యర్థులకు ఉచితం(free)గా రెసిడెన్షియల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం(Visakhapatnam)లోని అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌(Ambedkar Study Circle) - యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సన్నద్దమౌతున్న అభ్యర్థులకు ఉచితం(free)గా రెసిడెన్షియల్‌ కోచింగ్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఎగ్జామ్‌లకు శిక్షణ ఇస్తారు. నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్‌లు వర్తిస్తాయి. 


అర్హత

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.  అభ్యర్థుల వయసు ఆగస్టు 1 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు; బీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు వర్తిస్తుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు. 


ఎంపిక

ప్రీ క్వాలిఫయింగ్‌ టెస్ట్‌ ద్వారా ప్రిలిమ్స్‌ కోచింగ్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో అన్నీ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలే ఇస్తారు. కరెంట్‌ ఈవెంట్స్‌, జనరల్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఎకాలజీ, బయో డైవర్సిటీ అండ్‌ క్లయిమేట్‌ ఛేంజ్‌, ఇండియన్‌ పాలిటీ అండ్‌ డెవలప్‌మెంట్‌, ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ ఇండియా, ఇండియా అండ్‌ వరల్డ్‌ జాగ్రఫీ, ఇండియాస్‌ నేషనల్‌ మూమెంట్‌ అంశాలనుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు. ఈ టెస్ట్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా మొత్తం 150 మందికి అవకాశం కల్పిస్తారు. యూపీఎస్సీ నిర్వహించే ప్రిలిమ్స్‌ ఎగ్జామినేషన్‌లో అర్హత పొందినవారిని మెయిన్స్‌ కోచింగ్‌కు ఎంపిక చేస్తారు. ఇందులో 50 నుంచి 100 మందికి అవకాశం ఇస్తారు. మెయిన్స్‌లో అర్హత సాధించినవారికి పర్సనాలిటీ టెస్ట్‌పై అవగాహన కల్పిస్తారు. అనుభవజ్ఞులైన ఐఏఎస్‌/ ఐపీఎస్‌/ఐఎఫ్‌ఎస్‌/ ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్ల సహకారంతో పర్సనాలిటీ టెస్ట్‌లు నిర్వహిస్తారు. వీటికి హాజరయ్యే అభ్యర్థులకు న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో వసతి ఏర్పాటు చేస్తారు. 


ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 10 

వెబ్‌సైట్‌: apstdc.apcfss.in


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు : జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.600; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200 

ఈ-మెయిల్‌ దరఖాస్తుకు చివరి తేదీ : ఆగస్టు 10

రాత పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: ఆగస్టు 12

రాత పరీక్ష తేదీలు: ఆగస్టు 22, 23

ప్రవేశం పొందిన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: ఆగస్టు 23

అభ్యర్థుల రిపోర్టింగ్‌: ఆగస్టు 24, 25

ఈ-మెయిల్‌: mtech-admissions@diat.ac.in 

వెబ్‌సైట్‌ : www.diat.ac.in

Updated Date - 2022-07-29T20:44:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising