ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శుక్రుని అధ్యయనానికి భారత్‌ పంపబోయే ఉపగ్రహం ఏది?

ABN, First Publish Date - 2022-07-07T21:03:52+05:30

విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘కాస్మాలజీ’ అంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘కాస్మాలజీ’ అంటారు.
  • సూర్యుని నుంచి భూమికి గల దూరం: 15 కోట్ల కి.మీ. (లేదా) 15 x 107 కి.మీ. (లేదా) 149.5 మిలియన్‌ కి.మీ. (లేదా) 9,09,60,000 మైళ్లు
  • భూమి నుంచి చంద్రుడికి గల దూరం: 3,84,399 కి.మీ. (లేదా) 3.843105 కి.మీ. 
  • అంతరిక్ష దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు
  • 1.  A.U(Astronomical Unit) : 1.49631011m 2 కాంతి 
  • సంవత్సరం(Lyr) : 9.4631015m
  • 3.పార్‌సెక్‌ = 3.26 కాంతి సంవత్సరాలు
  • కాంతి సంవత్సరం: కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించిన దూరాన్ని ‘కాంతి సంవత్సరం’ అంటారు.
  • కాంతి సంవత్సరం అనేది ‘దూరం’ కొలవడానికి ఉపయోగించే ప్రమాణం
  • ఖగోళ ప్రమాణాల్లో అతిపెద్దది - పార్‌సెక్‌
  • సౌర కుటుంబంలోని మొత్తం గ్రహాలు - 09
  • ప్రస్తుతం పరిగణనలో ఉన్నవి - 08
  • మొత్తం ఉపగ్రహాలు- 175
  • ఫ్లూటోను గ్రహ హోదా నుంచి తొలగించడానికి కారణం ‘క్లియర్డ్‌ ద నైబర్‌ హుడ్‌’
  • తొలగించిన సంవత్సరం: 2006
  • తొలగించిన సంస్థ: IAU (Interna tional Astronomical Union)
  • ఫ్లూటోకి కేటాయించిన నెంబర్‌ : 134340
  • ఫ్లూటోకి గల ఇతర పేర్లు: మరుగుజ్జు గ్రహం, చీకటి గ్రహం, పిచ్చి గ్రహం

1. బుధుడు 

సౌర కుటుంబంలో సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం. 

సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం

పరిభ్రమణ కాలం : 88 రోజులు

ఉపగ్రహాలు లేవు


2. శుక్రుడు

  • భూమికి దగ్గరగా ఉన్న గ్రహం
  • ఇది భూమిని పోలి ఉంటుంది
  • అత్యంత వేడిగా ఉండే గ్రహం
  • తూర్పు నుంచి పడమరకు తిరగడం దీని ప్రత్యేకత
  • దీనికి గల మరొక పేరు - మార్నింగ్‌ స్టార్‌ - ఈవెనింగ్‌ స్టార్‌
  • పరిభ్రమణ కాలం: 225 రోజులు
  • ఉపగ్రహాలు లేవు
  • అత్యధిక ఆత్మభ్రమణ కాలం కలిగిన గ్రహం(243 రోజులు)
  • ఈ గ్రహంపై ఒక రోజు ప్రయాణం, ఒక సంవత్సర ప్రయాణం కంటే ఎక్కువ
  • శుక్రుడి అధ్యయనానికి భారత్‌ పంపబోయే ఉపగ్రహం - శుక్రయాన్‌ 2025
  • దీనిలో పంపబోయే పరికరం :  VIRAL
  • VIRAL Þ Venum Infrared  Atmospheric Gases Links
  • బుధ, శుక్ర గ్రహాలను ‘నిమృత గ్రహాలు’ అంటారు

3. భూమి 

విశ్వంలో జీవం కలిగి ఉన్న ఏకైక గ్రహం

ఇది తన మీద పడిన కాంతిని పరావర్తనం చెందించడం వల్ల నీలి, ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది

అధిక సాంద్రత కలిగిన గ్రహం(5.5 gr/c.c)

పరిభ్రమణ కాలం: 365 1/4 రోజులు

ఉపగ్రహాలు - 1(చంద్రుడు)


4. కుజుడు/అంగారకుడు

  • ఇది ఎరుపు రంగులో కనిపించడం చేత దీనిని అరుణగ్రహం అంటారు.
  • పరిభ్రమణ కాలం : 687 రోజులు
  • ఉపగ్రహాలు - 2(1.ఫోబోస్‌, 2.డీమోస్‌)
  • సౌర కుటుంబంలో అతి చిన్న ఉపగ్రహం - డీమోస్‌
  • భారత్‌ అంగారక గ్రహ అధ్యయనానికి పంపిన కృత్రిమ ఉపగ్రహం మంగళ్‌యాన్‌-1 (నవంబరు 2013)
  • 2000 రూ.ల నోటు వెనుక ఉండే చిహ్నం-మంగళ్‌యాన్‌ 
  • అంగారక గ్రహ అధ్యయనానికి 2018 నవంబరు 27న యూఎస్‌ఏ ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం - ఇన్‌సైట్‌

5. గురుడు/బృహస్పతి

  • సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం
  • దీని పరిమాణం, భూమి పరిమాణంతో పోల్చితే 1300 రెట్లు పెద్దది
  • దీని ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశితో పోల్చితే 318 రెట్లు పెద్దది
  • పరిభ్రమణ కాలం: 12 సంవత్సరాలు
  • ఉపగ్రహాలు: 69
  • అతిపెద్ద ఉపగ్రహం: గనిమెడ
  • ఆత్మభ్రమణ కాలం: 9 గంటల 9 నిమిషాలు

6. శని

  • ఇది పసుపు రంగులో కనిపిస్తుంది
  • అత్యల్ప సాంద్రత గల గ్రహం(0.687జట/ఛి.ఛి)
  • ప్రత్యేకత: వలయాలు ఏర్పడటం
  • నీటిలో తేలియాడే గ్రహం
  • పరిభ్రమణ కాలం: 29.5 సంవత్సరాలు
  • ఉపగ్రహాలు: 62
  • శని గ్రహపు అతి పెద్ద ఉపగ్రహం - టైటాన్‌

7. యురేనస్‌/వరణుడు

  • ఇది కూడా శుక్ర గ్రహం వలె తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది.
  • దీని అక్షం అధికంగా వంగి ఉండటం వల్ల తన చుట్టూ తిరిగినా కూడా దొర్లుతున్నట్లు కనిపిస్తుంది.
  • పరిభ్రమణ కాలం - 84 సంవత్సరాలు
  • ఉపగ్రహాలు - 27

8. ఇంద్రుడు

సౌర కుటుంబంలో సుదూరంగా ఉన్న గ్రహం

అతి శీతల గ్రహం(-3530F, -2140C)

పరిభ్రమణ కాలం: 165 సంవత్సరాలు

ఉపగ్రహాలు: 14


ప్రాక్టీస్‌ బిట్స్‌

1. వేగు చుక్క - సాయంకాల చుక్క అని పేరు గల గ్రహం

ఎ) అరుణ గ్రహం బి) బృహస్పతి

సి) శుక్రుడు    డి)  బుధుడు

2. కిందివాటిలో అంతర గ్రహం కానిది ఏది?

  ఎ) బుధుడు బి) భూమి

  సి) శుక్రుడు డి) గురుడు

3. సౌర కుటుంబంలో లేనిది?

   ఎ) ఉల్కలు బి) గెలాక్సీ

సి) తోకచుక్క డి) ఆస్టరాయిడ్స్‌

4. ఒక గ్రహం సూర్యుని నుంచి భూమికి గల దూరానికి 4 రెట్లు దూరంలో ఉంది. సూర్యుని చుట్టూ దాని పరిభ్రమణ కాలం?

ఎ) 4 సంవత్సరాలు 

బి) 6 సంవత్సరాలు

సి) 8 సంవత్సరాలు 

డి) 16 సంవత్సరాలు

5. ఎక్లిస్టిక్‌ అంటే?

ఎ) సూర్యుని గమన మార్గం

బి) భూమి గమన మార్గం

సి) చంద్రుని గమన మార్గం

డి) బృహస్పతి గమన మార్గం

సమాధానాలు: 

1) సి  2) డి 3) బి 

4) సి  5) బి




-శీలం దేవేందర్‌రెడ్డి

సీనియర్‌ ఫ్యాకల్టీ



Updated Date - 2022-07-07T21:03:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising