ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana విద్యాధన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌

ABN, First Publish Date - 2022-07-30T21:15:20+05:30

సరోజినీ దామోదర్‌ ఫౌండేషన్‌(Sarojini Damodar Foundation) - ‘విద్యాధన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా ఇంటర్‌, పదకొండు - పన్నెండు తరగతులు, డిప్లొమా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సరోజినీ దామోదర్‌ ఫౌండేషన్‌(Sarojini Damodar Foundation) - ‘విద్యాధన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా ఇంటర్‌, పదకొండు - పన్నెండు తరగతులు, డిప్లొమా  కోర్సులు చేసే అభ్యర్థులకు ఆర్థిక సహకారం అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు సంస్థ తరపున మెంటారింగ్‌ ప్రోగ్రామ్‌లు కూడా ఉంటాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌(Scholarship Program)ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 


అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి కనీసం 90 శాతం మార్కులతో / 9 సీజీపీఏ స్కోర్‌తో పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులకు 75 శాతం మార్కులు/ 7.5 సీజీపీఏ స్కోర్‌ చాలు. కుటుంబ వార్షికాదాయం రూ.2లక్షలు మించకూడదు.

ఎంపిక: వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరికి మాత్రమే ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. పరీక్ష కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థులకు ఈ- మెయిల్‌/ ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తారు.  

స్కాలర్‌షిప్‌: ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.10,000ల స్కాలర్‌షిప్‌ ఇస్తారు. అత్యధిక స్కోర్‌తో కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు ఉన్నత చదువుల కోసం ఏడాదికి రూ.10,000 నుంచి రూ.60,000 వరకు స్కాలర్‌షిప్‌ అందిస్తారు. 


ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31  

దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: పదోతరగతి లేదా తత్సమాన కోర్సు మార్కుల పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, అభ్యర్థి ఫొటో, ఇంటర్‌/పన్నెండోతరగతి/డిప్లొమా అడ్మిషన్‌ పొందిన కళాశాల వివరాలు.

అభ్యర్థుల స్క్రీనింగ్‌: ఆగస్టు 14

ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలు: ఆగస్టు 28 నుంచి 31 వరకు 

వెబ్‌సైట్‌: www.vidyadhan.org/apply

Updated Date - 2022-07-30T21:15:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising