ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Osmaniaలో పీహెచ్‌డీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌

ABN, First Publish Date - 2022-08-08T22:07:36+05:30

హైదరాబాద్‌(Hyderabad)లోని ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఉద్దేశించిన ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆర్ట్స్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌(Hyderabad)లోని ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఉద్దేశించిన ఎంట్రెన్స్‌ టెస్ట్‌ 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆర్ట్స్‌, కామర్స్‌, ఎడ్యుకేషన్‌, ఇంజనీరింగ్‌, ఇన్ఫర్మాటిక్స్‌, లా, ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌, సోషల్‌ సైన్సెస్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి. కేటగిరీ - 2  కింద కేటాయించిన సీట్లను ఈ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా భర్తీ చేస్తారు. 


స్పెషలైజేషన్‌లు: ఏన్షియంట్‌ ఇండియన్‌ హిస్టరీ కల్చర్‌ అండ్‌ ఆర్కియాలజీ, ఇంగ్లీష్‌, లింగ్విస్టిక్స్‌, పర్షియన్‌, ఫిలాసఫీ, సంస్కృతం, అరబిక్‌(ఓరియంటల్‌), తెలుగు(ఓరియంటల్‌), ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, సోషల్‌ వర్క్‌, సోషియాలజీ, కామర్స్‌, ఎడ్యుకేషన్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, లా, అప్లయిడ్‌ జియోకెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, జెనెటిక్స్‌, జాగ్రఫీ, జియాలజీ, జియోఫిజిక్స్‌, మేథమెటిక్స్‌, మైక్రోబయాలజీ, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌, జువాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌, కెమికల్‌ టెక్నాలజీ/ కెమికల్‌ ఇంజనీరింగ్‌, ఫుడ్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ.

అర్హత: అభ్యర్థులు ఎంచుకొన్న స్పెషలైజేషన్‌ను అనుసరించి సంబంధిత పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. డిస్టెన్స్‌ విధానంలో చదివినవారు కూడా అర్హులే. డిగ్రీ స్థాయిలో కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసి ఫలితాలు వెలువడనివారు దరఖాస్తుకు అనర్హులు.  

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ వివరాలు: ఇది కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌.  ప్రతి స్పెషలైజేషన్‌కు నిర్దేశించిన సిలబస్‌ ప్రకారం ప్రశ్నలు అడుగుతారు. రిసెర్చ్‌ స్టడీ, ఎక్స్‌పరిమెంటల్‌, థియరిటికల్‌ అంశాలనుంచి మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. అనాలజీ, క్లాసిఫికేషన్‌, మ్యాచింగ్‌, కాంప్రహెన్షన్‌ విధానాల్లో ప్రశ్నలు ఉంటాయి. లాంగ్వేజ్‌లు మినహా అన్ని స్పెషలైజేషన్‌లకు ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. మొత్తం మార్కులు 70. ఇందులో అర్హత పొందాలంటే జనరల్‌ అభ్యర్థులు కనీసం 35 మార్కులు; రిజర్వ్‌డ్‌ వర్గాల అభ్యర్థులు కనీసం 32 మార్కులు సాధించాల్సి ఉంటుంది. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1500; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.1000 

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 18 నుంచి

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 17     

వెబ్‌సైట్‌: www.osmania.ac.in

Updated Date - 2022-08-08T22:07:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising