ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Osmania Universityలో పార్ట్‌ టైం పీజీ

ABN, First Publish Date - 2022-09-17T22:00:41+05:30

ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) ఆధ్వర్యంలోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌(University College of Engineering) (యూసీఈఓయూ)- పార్ట్‌ టైం ఎంఈ/ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అడ్మిషన్స్‌ నిర్వహిస్తోంది. ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. ఇందులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) ఆధ్వర్యంలోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌(University College of Engineering) (యూసీఈఓయూ)- పార్ట్‌ టైం ఎంఈ/ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అడ్మిషన్స్‌ నిర్వహిస్తోంది. ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. ఇందులో ఆరు సెమిస్టర్లు ఉంటాయి. ఇండస్ట్రీ స్పాన్సర్డ్‌/ నామినేటెడ్‌ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగలవారు యూసీఈ క్యాంప్‌స్‌లో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు.

స్పెషలైజేషన్‌లు - సీట్లు: సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌, వాటర్‌ రిసోర్స్‌ ఇంజనీరింగ్‌, జియో టెక్నికల్‌ ఇంజనీరింగ్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లు; ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో డిజిటల్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌, సిస్టమ్స్‌ అండ్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, మైక్రోవేవ్‌ అండ్‌ రాడార్‌ ఇంజనీరింగ్‌, వీఎల్‌ఎ్‌సఐ అండ్‌ ఎంబెడెడ్‌ సిస్టమ్‌ స్పెషలైజేషన్‌లు; ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ఇండస్ట్రియల్‌ డ్రైవ్స్‌ అండ్‌ కంట్రోల్‌, పవర్‌ సిస్టమ్స్‌, పవర్‌ ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ స్పెషలైజేషన్‌లు; మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌, ఆటొమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌, టర్బో మెషినరీ స్పెషలైజేషన్‌లు; మైనింగ్‌ విభాగంలో మైనింగ్‌ ఇంజనీరింగ్‌; కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో కంప్యూటర్‌ సైన్స్‌, పార్లెల్‌ డిస్ట్రిబ్యూటెడ్‌ సిస్టం, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి. ఒక్కో స్పెషలైజేషన్‌లో 5 సీట్లు చొప్పున మొత్తం 90 సూపర్‌న్యూమరరీ కోటా సీట్లు ఉన్నాయి.   


అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ/ ఏఎంఐఈటీఈ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు చాలు. ఆగస్టు 31 నాటికి అభ్యర్థులకు ఇండస్ట్రీ/ ఎడ్యుకేషన్‌/ రిసెర్చ్‌ సంస్థల్లో కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. కౌన్సెలింగ్‌ సమయంలో స్పాన్సర్‌షిప్‌ లెటర్‌, నో అబ్జెక్షన్‌ లెటర్‌లు సబ్మిట్‌ చేయాలి.


ఫీజు: రూ.1000 

కౌన్సెలింగ్‌: సెప్టెంబరు 24

కౌన్సెలింగ్‌ వేదిక: అసెంబ్లీ హాల్‌, మెయిన్‌ బిల్డింగ్‌, యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, ఉస్మానియా యూనివర్సిటీ

వెబ్‌సైట్‌: www.uceou.edu

Updated Date - 2022-09-17T22:00:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising