నిట్‌లో ప్రవేశానికి నిమ్‌సెట్
ABN, First Publish Date - 2022-04-06T20:46:51+05:30
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) సంస్థలు అందిస్తున్న మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఉద్దేశించిన ‘నిట్ ఎంసీఏ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (నిమ్‌సెట్) 2022’ నోటిఫికేషన్ వెలువడింది. దీనిని నిట్, జంషెడ్పూర్ నిర్వహిస్తోంది...
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) సంస్థలు అందిస్తున్న మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఉద్దేశించిన ‘నిట్ ఎంసీఏ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (నిమ్‌సెట్) 2022’ నోటిఫికేషన్ వెలువడింది. దీనిని నిట్, జంషెడ్పూర్ నిర్వహిస్తోంది. ఇందులో వరంగల్, రాయ్‌పూర్, సూరత్కల్, తిరుచిరాపల్లి, కురుక్షేత్ర, అగర్తల, జంషెడ్పూర్, భోపాల్, అలహాబాద్ నిట్‌లు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు. వరంగల్ నిట్‌లో రెండేళ్ల కోర్సు పూర్తయ్యాక ప్రోగ్రామ్ నుంచి వైదొలగే వీలుంది. వీరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ (పీజీఏడీసీఏ)ని ప్రదానం చేస్తారు.
సీట్లు: మొత్తం 813 సీట్లు ఉన్నాయి. వరంగల్ నిట్‌లో 58, తిరుచిరాపల్లి నిట్‌లో 115, సూరత్కల్ నిట్‌లో 58, రాయ్‌పూర్ నిట్‌లో 110, కురుక్షేత్ర నిట్‌లో 96, జంషెడ్పూర్ నిట్‌లో 115, భోపాల్ ఎంఏఎన్‌ఐటీలో 115, అలహాబాద్ ఎంఏఎన్‌ఐటీలో 116, అగర్తల, నిట్‌లో 30 సీట్లు ఉన్నాయి.
అర్హత: మేథమెటిక్స్/ స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్‌గా ప్రథమ శ్రేణి మార్కులతో బీఎస్సీ/ బీఎస్సీ ఆనర్స్/ బీసీఏ/ బీఐటీ/ బీ ఒకేషనల్(కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్/ సాఫ్ట్‌వేర్ డెవల్‌పమెంట్)/ బీబీఏ (కంప్యూటర్ అప్లికేషన్స్) ఉత్తీర్ణులై ఉండాలి. బీఈ/ బీటెక్ అభ్యర్థులు, దూరవిద్య విధానంలో చదివినవారు కూడా అర్హులే. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసేవారూ అప్లయ్ చేసుకోవచ్చు. వీరు సెప్టెంబరు 15 నాటికి డిగ్రీ సర్టిఫికెట్, మార్కుల పత్రాలు సబ్మిట్ చేయాలి.
నిమ్‌సెట్ 2022: దీనిని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. మేథమెటిక్స్ నుంచి 50, అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి 40, కంప్యూటర్ అవేర్‌నెస్ నుంచి 10, జనరల్ ఇంగ్లీష్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించారు. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు కోత విధిస్తారు. ప్రశ్నలన్నీ ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు.
ఎంపిక: నిమ్‌సెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంక్‌లు ప్రకటిస్తారు. ఈ ర్యాంక్‌ల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు. అభ్యర్థులు నిట్ సంస్థలకు విడిగా దరఖాస్తు చేసుకోనవసరం లేదు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.2,500; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1,250
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్ 4 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 4
అడ్మిట్ కార్డ్‌ల డౌన్‌లోడింగ్: జూన్ 6 నుంచి 19 వరకు
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విజయవాడ
నిమ్‌సెట్ 2022 ఎగ్జామ్ తేదీ: జూన్ 20
ఫలితాలు విడుదల: జూలై 5
మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు: జూలై 18
రెండో రౌండ్ సీట్ల కేటాయింపు: జూలై 29
మూడో రౌండ్ సీట్ల కేటాయింపు: ఆగస్టు 8
ప్రోగ్రామ్ ప్రారంభం: ఆగస్టు 18
మిగిలిన సీట్ల వివరాల ప్రకటన: ఆగస్టు 20
చివరి రౌండ్ సీట్ల కేటాయింపు: ఆగస్టు 27
వెబ్‌సైట్: www.nimcet.in
Updated Date - 2022-04-06T20:46:51+05:30 IST