ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Manageలో పీజీడీఎం (అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌)

ABN, First Publish Date - 2022-10-17T22:02:01+05:30

హైదరాబాద్‌ - రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌(మేనేజ్‌) - ‘పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌)’ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్‌నకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ - రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌(మేనేజ్‌) - ‘పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌)’ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్‌నకు ఏఐసీటీఈ గుర్తింపు ఉంది.  ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. ఇందులో ఏడు ట్రైమెస్టర్లు ఉంటాయి. నాలుగో ట్రైమెస్టర్‌లో సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది.   

స్పెషలైజేషన్‌ విభాగాలు: ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, అనలిటిక్స్‌ 

అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి  అగ్రికల్చర్‌ సైన్సెస్‌/ అగ్రికల్చర్‌ సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. హ్యుమానిటీస్‌/ సోషల్‌ సైన్సెస్‌/ ఇంజనీరింగ్‌/ ప్యూర్‌ సైన్సెస్‌/ కామర్స్‌ విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులు కూడా అర్హులే. డిగ్రీ స్థాయిలో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. క్యాట్‌ 2022 అర్హత పొంది ఉండాలి.    

ఎంపిక: క్యాట్‌ 2022 స్కోర్‌ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరికి గ్రూప్‌ డిస్కషన్స్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. క్యాట్‌ 2022 స్కోర్‌నకు 55 శాతం, డైవర్సిటీ ఫ్యాక్టర్‌కు 6 శాతం, ఎస్సే రైటింగ్‌కు 5 శాతం, గ్రూప్‌ డిస్కషన్స్‌కు 10 శాతం, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 14 శాతం, అనుభవానికి గరిష్ఠంగా 5 శాతం, అకడమిక్‌ ప్రతిభకు గరిష్ఠంగా 5 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.1200 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600) 

ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 31

వెబ్‌సైట్‌:  www.manage.gov.in

Updated Date - 2022-10-17T22:02:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising