ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NITCలో పారా మెడికల్‌ కోర్సులు

ABN, First Publish Date - 2022-07-01T20:00:42+05:30

న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇండస్ట్రియల్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌(National Industrial Training Centre) (ఎన్‌ఐటీసీ) - క్రాఫ్ట్స్‌మెన్‌ ట్రెయినింగ్‌ స్కీం (సీటీఎస్‌) క్రింద పారా మెడికల్‌ కోర్సు(Para medical course)ల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. వీటిని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇండస్ట్రియల్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌(National Industrial Training Centre) (ఎన్‌ఐటీసీ) - క్రాఫ్ట్స్‌మెన్‌ ట్రెయినింగ్‌ స్కీం (సీటీఎస్‌) క్రింద పారా మెడికల్‌ కోర్సు(Para medical course)ల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. వీటిని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. నిబంధనల ప్రకారం కోర్సులు పూర్తిచేసినవారికి నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఒకేషనల్‌ ట్రెయినింగ్‌ (ఎన్‌సీవీటీ) సర్టిఫికెట్‌లు ప్రదానం చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రముఖ పీఎ్‌సయూలలో సబార్డినేట్‌ ఉద్యోగాలు సహా వివిధ సర్వీస్‌ పోస్టుల భర్తీకి ఈ సర్టిఫికెట్‌లు తప్పనిసరి. ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వుడు అభ్యర్థులకు స్కాలర్‌షిప్‌ సౌకర్యం వర్తిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం బస్‌పాస్‌ సౌకర్యం కల్పిస్తుంది. ఇందుకు నెలకు రూ.100లు చెల్లిచాల్సి ఉంటుంది.


కోర్సులు - సీట్లు: హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో 216 సీట్లు ఉన్నాయి. ఫిజియోథెరపి టెక్నీషియన్‌ కోర్సు వ్యవధి ఏడాది. ఇందులో 60 సీట్లు ఉన్నాయి. డెంటల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో 48 సీట్లు ఉన్నాయి. రేడియాలజీ టెక్నీషియన్‌ కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో 40 సీట్లు ఉన్నాయి.

అర్హత: హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, ఫిజియోథెరపి టెక్నీషియన్‌, డెంటల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సులకు పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. రేడియాలజీ టెక్నీషియన్‌ కోర్సుకు సైన్స్‌ గ్రూప్‌తో ఇంటర్‌/ పన్నెండోతరగతి పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థి వయసు ఆగస్టు 1 నాటికి పద్నాలుగేళ్లు నిండి ఉండాలి. 


దరఖాస్తు ఫీజు: రూ.500 

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 30

వెబ్‌సైట్‌: www.nitcindia.com

Updated Date - 2022-07-01T20:00:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising