Andhra Universityలో ఎంబీఏ, ఎంసీఏ
ABN, First Publish Date - 2022-10-17T22:07:00+05:30
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ - సెల్ఫ్ సపోర్ట్ మోడ్‌లో నిర్వహిస్తున్న ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ - సెల్ఫ్ సపోర్ట్ మోడ్‌లో నిర్వహిస్తున్న ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి ఫుల్ టైం ప్రోగ్రామ్‌లు. ఏపీ ఐసెట్ 2022 ర్యాంక్, కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు.
స్పెషలైజేషన్‌లు - సీట్లు: ఎంబీఏ ప్రోగ్రామ్‌లో మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కోదానిలో 44 సీట్లు ఉన్నాయి. ఎంసీఏ ప్రోగ్రామ్‌లో 10 సీట్లు ఉన్నాయి.
అర్హత: ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి కనీసం 50 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంసీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ద్వితీయ శ్రేణి మార్కులతో బీసీఏ / డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్) / తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు; ఇంటర్ స్థాయిలో మేథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా చదివి బీఏ/ బీకాం/ బీఎస్సీ పూర్తిచేసినవారు అప్లయ్ చేసుకోవచ్చు.
ముఖ్య సమాచారం
ఎంబీఏ క్యాంపస్: ఏయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్
ఎంసీఏ క్యాంపస్: ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విశాఖపట్నం
ప్రోగ్రామ్ ఫీజు: ఎంబీఏ ప్రోగ్రామ్‌నకు ఏడాదికి రూ.1,50,000; ఎంసీఏ ప్రోగ్రామ్‌నకు ఏడాదికి రూ.1,25,000
దరఖాస్తు ఫీజు: రూ.2,000
కౌన్సెలింగ్ ఫీజు: రూ.600
దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: ఏపీ ఐసెట్ 2022 ర్యాంక్ కార్డ్; డిగ్రీ, ఇంటర్/ డిప్లొమా, పదోతరగతి సర్టిఫికెట్‌లు - మార్కుల పత్రాలు; టీసీ, తొమ్మిదో తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్‌లు; కులం, ఆదాయం, వైకల్యం ధ్రువీకరణ పత్రాలు
స్వయంగా/ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: అక్టోబరు 22
కౌన్సెలింగ్: అక్టోబరు 25
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఆంధ్ర యూనివర్సిటీ, విజయనగర్ ప్యాలెస్, పెదవాల్తేర్, విశాఖపట్నం - 530017
వెబ్‌సైట్: www.audoa.in
Updated Date - 2022-10-17T22:07:00+05:30 IST