ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bangalore IHMలో డిప్లొమాలు

ABN, First Publish Date - 2022-07-06T21:25:33+05:30

బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ అప్లయిడ్‌ న్యూట్రిషన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ అప్లయిడ్‌ న్యూట్రిషన్‌(Institute of Hotel Management Catering Technology and Applied Nutrition) (ఐహెచ్‌ఎం) - డిప్లొమా, క్రాప్ట్స్‌మన్‌షిప్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఒక్కో ప్రోగ్రామ్‌లో 40 సీట్లు ఉన్నాయి. ప్రతి కోర్సులో రెండు టర్మ్‌లు ఉంటాయి. మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. హాస్టల్‌ సౌకర్యం ఉంది.


క్రాఫ్ట్స్‌మన్‌షిప్‌ 

ఫుడ్‌ ప్రొడక్షన్‌ ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. తరవాత ప్రముఖ హోటల్‌లో ఆర్నెల్ల ట్రెయినింగ్‌ ఉంటుంది. ఫుడ్‌ బేవరేజ్‌ సర్వీస్‌ ప్రోగ్రామ్‌ వ్యవధి 21 వారాలు. తరవాత ఏదేని హోటల్‌లో మూడు వారాల ట్రెయినింగ్‌ ఉంటుంది. పదోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.


డిప్లొమాలు: డిప్లొమా ఇన్‌ ఫుడ్‌ ప్రొడక్షన్‌, డిప్లొమా ఇన్‌ బేకరీ అండ్‌ కన్‌ఫెక్షనరీ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. ప్రముఖ హోటల్‌/ బేకరీలో మరో ఆర్నెల్ల ట్రెయినింగ్‌ ఉంటుంది. ఇంగ్లీష్‌ ఒక సబ్జెక్ట్‌గా ఇంటర్‌/ పన్నెండోతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.   


ముఖ్య సమాచారం

అభ్యర్థుల వయసు: జూలై 30 నాటికి 26 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.300; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: జూలై 29 

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: ఆగస్టు 8న

తరగతులు ప్రారంభం: క్రాఫ్ట్స్‌మన్‌షిప్‌ ప్రోగ్రామ్‌లు ఆగస్టు 11 నుంచి; డిప్లొమా ప్రోగ్రామ్‌లు ఆగస్టు 18 నుంచి

వెబ్‌సైట్‌: ihmbangalore.kar.nic.in

Updated Date - 2022-07-06T21:25:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising