ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IIFTలో ఎంఏ ఎకనామిక్స్‌

ABN, First Publish Date - 2022-07-01T20:23:15+05:30

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(Indian Institute of Foreign Trade) (ఐఐఎఫ్‌టీ) - ఎంఏ ఎకనామిక్స్‌( MA Economics‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రోగ్రామ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(Indian Institute of Foreign Trade) (ఐఐఎఫ్‌టీ) - ఎంఏ ఎకనామిక్స్‌( MA Economics‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రోగ్రామ్‌ స్పెషలైజేషన్‌ ట్రేడ్‌ అండ్‌ ఫైనాన్స్‌. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఢిల్లీ, కోల్‌కతా క్యాంపస్‌లలో ఈ కోర్సుఅందుబాటులో ఉంది. ఒక్కో క్యాంప్‌సలో 90 సీట్లు ఉన్నాయి. ప్రొక్టోరింగ్‌ బేస్డ్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ ద్వారా  అడ్మిషన్స్‌ ఇస్తారు.


అర్హత

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు చాలు. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసినవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. 


అడ్మిషన్‌ టెస్ట్‌ వివరాలు

దీనిని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. బేసిక్‌ మేథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, మైక్రో ఎకనామిక్స్‌, మాక్రో ఎకనామిక్స్‌, ఇంటర్నేషనల్‌ ఎకనామిక్స్‌, పబ్లిక్‌ ఫైనాన్స్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలను డిగ్రీ ఎకనామిక్స్‌ స్థాయిలో అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1600; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.800

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: జూన్‌ 25

అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడింగ్‌: జూలై 5 నుంచి

ప్రొక్టోరింగ్‌ బేస్డ్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ తేదీ: జూలై 9న

వెబ్‌సైట్‌: www.iift.ac.in

Updated Date - 2022-07-01T20:23:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising