ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత రాజ్యాంగం - రాజకీయ వ్యవస్థ

ABN, First Publish Date - 2022-09-27T22:29:41+05:30

రాష్ట్రపతి భారతదేశంలో త్రివిధ దళాధిపతిగా, సర్వసైన్యాధ్యక్షునిగా కొనసాగుతాడు. ఈ హోదాలో రాష్ట్రపతి అనేక నియామకాలు చేపడతారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కార్యనిర్వహణ అధికారాలు


ఆర్టికల్‌- 53: కార్యనిర్వహణ అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయి.

రాష్ట్రపతి భారతదేశంలో త్రివిధ దళాధిపతిగా, సర్వసైన్యాధ్యక్షునిగా కొనసాగుతాడు. ఈ హోదాలో రాష్ట్రపతి అనేక నియామకాలు చేపడతారు.

ఆర్టికల్‌-74(1): దేశ పరిపాలనా నిర్వహణలో రాష్ట్రపతికి సలహాలు, సహాయాన్ని అందించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఉంటుంది.

ఆర్టికల్‌-75(1): ప్రధానమంత్రి, మంత్రి మండలిని నియమిస్తారు.

ఆర్టికల్‌- 76: అటార్నీ జనరల్‌ను నియమిస్తారు.

ఆర్టికల్‌- 148: సీఏజీ (కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌)ను నియమిస్తారు.

ఆర్టికల్‌- 324: కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్‌, సభ్యులను నియమిస్తారు.

ఆర్టికల్‌- 315: యూపీఎస్సీ, జాయింట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను  ఏర్పాటుచేస్తారు.

ఆర్టికల్‌- 316: యూపీఎస్సీ, జాయింట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల చైర్మన్‌, సభ్యును నియమిస్తారు.

ఆర్టికల్‌-280: కేంద్ర ఆర్థికసంఘం, ఆర్థిక సంఘ చైర్మన్‌ను నియమిస్తారు.

ఆర్టికల్‌-124: సుప్రీంకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు.

ఆర్టికల్‌-217: హైకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు.

ఆర్టికల్‌-338: జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌, సభ్యులను నియమిస్తారు.

ఆర్టికల్‌-338(ఎ): జాతీయ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌, సభ్యులను నియమిస్తారు.

ఆర్టికల్‌-338(బి): జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌, సభ్యులను నియమిస్తారు.

ఆర్టికల్‌- 155: గవర్నర్లను నియమిస్తారు.

ఆర్టికల్‌-239: కేంద్రపాలిత ప్రాంతాల పాలకులను నియమిస్తారు. (లెఫ్టినెంట్‌ గవర్నర్లు, ముఖ్యమంత్రులను)

ఆర్టికల్‌-323(ఎ): సీఏటీ చైర్మన్‌ (కేంద్ర అడ్మినిస్ర్టేటివ్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌)ను నియమిస్తారు.

ఆర్టికల్‌-262: జల వనరుల ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేస్తారు.

ఆర్టికల్‌-263: కేంద్రం-రాష్ట్రాలకు, రాష్ట్రాలకు-రాష్ర్టాలకు మధ్య సమన్వయం సాధించుటకు అంతర్‌రాష్ట్ర కౌన్సిల్‌ ఏర్పాటు.


శాసన నిర్మాణ అధికారాలు

ఆర్టికల్‌-79: ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం. రాష్ట్రపతి ఆమోదం లేకుండా బిల్లులు చట్టాలు కావు. ఈ హోదాలో రాష్ట్రపతి కింది కార్యకలాపాలు నిర్వర్తిస్తారు.

ఆర్టికల్‌-85: పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేస్తారు, వాయిదా వేస్తారు.

ఆర్టికల్‌-86: పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఉభయ సభలను ఉద్దేశించి వేర్వేరుగా గానీ, సంయుక్తంగా గానీ ప్రసంగించవచ్చు.

ఆర్టికల్‌-87: ప్రతి సంవత్సరం బడ్జెట్‌ సమావేశాలను ఏర్పాటుచేస్తారు.

ఆర్టికల్‌-99: పార్లమెంటు సభ్యులతో మూడో షెడ్యూల్‌లో పేర్కొన్నవిధంగా ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి/ రాష్ట్రపతి సూచించిన వ్యక్తి.

ఆర్టికల్‌-123: పార్లమెంటు సమావేశాల్లో లేనప్పుడు దేశ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రపతి ఆర్డినెన్స్‌లు జారీ చేస్తాడు. (రాష్ట్రాల్లో అయితే ఆర్టికల్‌-213 ప్రకారం గవర్నర్‌ ఆర్డినెన్స్‌లు జారీ చేస్తారు)

రాష్ట్రపతి, గవర్నర్‌తో జారీ చేసే ఆర్డినెన్స్‌ కాలపరమితి ఆరు నెలలు.

ఆర్టికల్‌-123 ప్రకారం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను పార్లమెంటు తిరిగి సమావేశమైన ఆరు వారాల లోపల పార్లమెంటు ముందు ఉంచాలి. అప్పుడు ఆ ఆర్డినెన్స్‌ పార్లమెంటు ఆమోదిస్తే అది చట్టం అవుతుంది, పార్లమెంటు తిరస్కరిస్తే ఆ ఆర్డినెన్స్‌ రద్దు అవుతుంది.


గమనిక: రాష్ట్రపతి, గవర్నర్‌ జారీ చేసిన ఆర్డినెన్స్‌ యొక్క గరిష్ఠ కాలపరిమితి - ఆరు నెలలు + ఆరు వారాలు (7 1/2 నెలలు)

ఆర్డినెన్స్ ఆవశ్యవత: అనుకోకుండా ఎదురయ్యే సమస్యలకు చట్టబద్ధ పరిష్కారం చూపాలంటే ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం తప్పనిసరి, ఎందుకంటే పార్లమెంటు, రాష్ట్ర శాసన సభలు 365 రోజులు సమావేశంలో ఉండవు.




 -వి.చైతన్యదేవ్

పోటీ పరీక్షల నిపుణులు



Updated Date - 2022-09-27T22:29:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising