ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP RCET 2022 నోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2022-09-16T18:00:41+05:30

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) తరపున విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ(Andhra University) (ఏయూ) - రిసెర్చ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఆర్‌సెట్‌) 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్‌ ద్వారా పార్ట్‌ టైం/ ఫుల్‌ టైం పీహెచ్‌డీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) తరపున విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ(Andhra University) (ఏయూ) - రిసెర్చ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఆర్‌సెట్‌) 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్‌ ద్వారా పార్ట్‌ టైం/ ఫుల్‌ టైం పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ, అనుబంధ కళాశాలలు, రిసెర్చ్‌ సెంటర్లలో అడ్మిషన్స్‌ ఇస్తారు. 


స్పెషలైజేషన్‌లు: అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, ఆంత్రోపాలజీ, ఆర్కియాలజీ, బుద్దిస్ట్‌ స్టడీస్‌, కామర్స్‌, ఎకనామిక్స్‌, ఎడ్యుకేషన్‌, ఇంగ్లీష్‌, ఫైన్‌ఆర్ట్స్‌, ఫోక్‌లోర్‌, హిందీ, హిస్టరీ, ఇంటర్నేషనల్‌ అండ్‌ ఏరియా స్టడీస్‌, లా, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, లింగ్విస్టిక్స్‌, మేనేజ్‌మెంట్‌, మ్యూజిక్‌, పర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌, ఫిలాసఫీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌, పాపులేషన్‌ స్టడీస్‌, సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, డా.అంబేద్కర్‌ స్టడీస్‌, డా.బాబు జగ్జీవన్‌రాం స్టడీస్‌, రూరల్‌ డెవల్‌పమెంట్‌, సోషల్‌ వర్క్‌, సోషియాలజీ, సంస్కృతం, తెలుగు, టూరిజం మేనేజ్‌మెంట్‌, ఉమన్‌ స్టడీస్‌, అప్లయిడ్‌ లైఫ్‌ సైన్సెస్‌, బయో కెమిస్ట్రీ, బోటనీ, కెమికల్‌ సైన్సెస్‌, కంప్యూటర్‌ సైన్స్‌ 


అండ్‌ అప్లికేషన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, జాగ్రఫీ, జియాలజీ, హోం సైన్స్‌, మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ నానో టెక్నాలజీ, మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, సెరికల్చర్‌, స్టాటిస్టిక్స్‌, జువాలజీ, సివిల్‌ ఇంజనీరింగ్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, ఫుడ్‌ టెక్నాలజీ, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌, మెరైన్‌ ఇంజనీరింగ్‌, ఫార్మసీ, బయోటెక్నాలజీ.


అర్హత: ఏపీ ఆర్‌సెట్‌ 2022కు హాజరయ్యే అభ్యర్థులను రెండు కేటగిరీలుగా వర్గీకరించారు. 

కేటగిరీ 1 అభ్యర్థులు: కనీసం 55 శాతం మార్కులతో సైన్స్‌, ఆర్ట్స్‌, మేనేజ్‌మెంట్‌, కామర్స్‌, లా, ఫార్మసీ, ఇంజనీరింగ్‌ విభాగాల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి. స్పెషలైజేషన్‌ను అనుసరించి యూజీసీ నెట్‌- జేఆర్‌ఎఫ్‌/ సీఎ్‌సఐఆర్‌ నెట్‌ - జేఆర్‌ఎఫ్‌/స్లెట్‌/ ఇతర ఫెలోషిప్స్‌ అర్హత పొంది ఉండాలి. ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు గేట్‌, ఫార్మసీ అభ్యర్థులకు జీప్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉండాలి. ఎఫ్‌డీపీ/టీచర్‌ ఫెలోషిప్‌ పొందినవారు, ఎంఫిల్‌ ప్రోగ్రామ్‌ పూర్తిచేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఏపీఆర్‌సెట్‌లో సెక్షన్‌-ఎ (రిసెర్చ్‌ మెథడాలజీ) రాస్తే చాలు. దీనికి 70 మార్కులు ఉంటాయి. ఇందులో అర్హత పొందినవారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూకి 30 మార్కులు నిర్దేశించారు.   

కేటగిరీ 2 అభ్యర్థులు: సంబంధిత స్పెషలైజేషన్‌తో పీజీ పూర్తిచేసి పైన తెలిపిన అర్హతలు లేనివారు ఈ కేటగిరీ కింద పరీక్ష రాయాల్సి ఉంటుంది. వీరు సెక్షన్‌ ఎ (రిసెర్చ్‌ మెథడాలజీ)తోపాటు సెక్షన్‌ బి(స్పెషలైజేషన్‌ సబ్జెక్ట్‌) కూడా రాయాల్సి ఉంటుంది. ఒక్కో సెక్షన్‌కు 70 మార్కులు ఉంటాయి. నిబంధనల ప్రకారం అర్హత పొందినవారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. దీనికి 60 మార్కులు నిర్దేశించారు.


  • పీజీ కాలేజీల్లో ఫ్యాకల్టీ/ లైబ్రేరియన్‌/ అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌గా కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు; పాలిటెక్నిక్‌/ ప్రభుత్వ/ ప్రైవేట్‌/ అనుబంధ జూనియర్‌ కాలేజీలు/ పాఠశాలల్లో ఫ్యాకల్టీగా కనీసం నాలుగేళ్ల అనుభవం ఉన్నవారు పార్ట్‌టైం పీహెచ్‌డీకి అప్లయ్‌ చేసుకోవచ్చు. వీరు సర్వీస్‌ సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ చేయాలి. వయోపరిమితి నిబంధనలు లేవు.


ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1500; బీసీ అభ్యర్థులకు రూ.1300; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000 

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 24

దరఖాస్తులో కరెక్షన్స్‌: అక్టోబరు 10, 11

హాల్‌ టికెట్స్‌ డౌన్‌లోడింగ్‌: అక్టోబరు 13 

పరీక్ష కేంద్రాలు: ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాలు, హైదరాబాద్‌

ఏపీ ఆర్‌సెట్‌  తేదీలు: అక్టోబరు 16-19 వరకు

ప్రిలిమినరీ కీల విడుదల: అక్టోబరు 17-20 

వెబ్‌సైట్‌: cets.apsche.ap.gov.in/rcet

Updated Date - 2022-09-16T18:00:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising