ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Art and Design Common ఎంట్రెన్స్‌ టెస్ట్‌

ABN, First Publish Date - 2022-07-05T21:57:56+05:30

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(Andhra Pradesh State Council of Higher Education) (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) - ‘ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(Art and Design Common Entrance Test) (ఏడీసెట్‌) 2022’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిని కడపలోని డా.వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(Andhra Pradesh State Council of Higher Education) (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) - ‘ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(Art and Design Common Entrance Test) (ఏడీసెట్‌) 2022’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిని కడపలోని డా.వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (వైఎస్సార్‌ఏఎఫ్‌యూ) నిర్వహిస్తోంది. ఇందులో సాధించిన మెరిట్‌ ఆధారంగా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎ్‌ఫఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీ డిజైన్‌) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. 


  • బీఎఫ్‌ఏ స్పెషలైజేషన్‌లు: పెయింటింగ్‌, స్కల్ప్‌చర్‌, యానిమేషన్‌, అప్లయిడ్‌ ఆర్ట్స్‌, ఫొటోగ్రఫీ
  • బీ డిజైన్‌ స్పెషలైజేషన్‌: ఇంటీరియర్‌ డిజైన్‌


అర్హత: ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, ఎంబైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూప్‌లలో ఒకదానితో ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఏడీసెట్‌ వివరాలు: ఇది కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌. ఇందులో మొత్తం 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. జనరల్‌ నాలెడ్జ్‌, ఆర్ట్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, టెక్నికల్‌ డీటైల్స్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఆర్ట్‌, పెయింటింగ్‌, స్కల్ప్‌చర్‌, యానిమేషన్‌, ఫొటోగ్రఫీ, ఆర్ట్‌ హిస్టరీ, డిజైన్‌ స్కిల్స్‌ అంశాలనుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 100. పరీక్ష సమయం రెండు గంటలు. ఇందులో అర్హత సాధించాలంటే కనీసం 35 శాతం మార్కులు రావాలి.  


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1000; బీసీ అభ్యర్థులకు రూ.750; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 3 

హాల్‌ టికెట్స్‌ డౌన్‌లోడింగ్‌: ఆగస్టు 13 నుంచి

ఏడీసెట్‌ 2022 తేదీ: ఆగస్టు 20

వెబ్‌సైట్‌: www.ysrafu.ac.in

Updated Date - 2022-07-05T21:57:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising