ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌

ABN, First Publish Date - 2022-10-07T20:27:53+05:30

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చూరీస్‌ ఆఫ్‌ ఇండియా - స్టూడెంట్‌ నమోదు సహా తదుపరి యాక్చూరియల్‌ ఎగ్జామ్స్‌ రాసేందుకు ఉద్దేశించిన ‘యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చూరీస్‌ ఆఫ్‌ ఇండియా - స్టూడెంట్‌ నమోదు సహా తదుపరి యాక్చూరియల్‌ ఎగ్జామ్స్‌ రాసేందుకు ఉద్దేశించిన ‘యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏసెట్‌) 2022 నవంబరు సెషన్‌కు దరఖాస్తులు కోరుతోంది. ఎగ్జామ్‌కు సంబంధించిన వివరాలను అభ్యర్థుల ఈ మెయిల్స్‌కు పంపుతారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం సంస్థ మాక్‌ టెస్టులు కూడా నిర్వహిస్తుంది. గడచిన  ఆరేళ్ల ప్రశ్న పత్రాలు, వాటి సమాధానాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఏసెట్‌ స్కోర్‌ వ్యాలిడిటీ మూడేళ్లు.


అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదేని గ్రూపుతో ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా, డిగ్రీ కోర్సులు పూర్తిచేసినవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఎకనామెట్రిక్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా చదివినవారికి; ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌, కాస్ట్‌ అకౌంటెంట్‌, కంపెనీ సెక్రటరీ కోర్సులు చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. 

ఏసెట్‌ వివరాలు: పరీక్ష సమయం మూడు గంటలు. ఇందులో మేథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, ఇంగ్లీష్‌, డేటా ఇంట్రప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌ అంశాలనుంచి 70 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 100. ఒక మార్కు ప్రశ్నలు 45, రెండు మార్కుల ప్రశ్నలు 20, మూడు మార్కుల ప్రశ్నలు 5 అడుగుతారు. మేథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌లకు సంబంధించి ఒక్కోదానిలో 30 మార్కులకు; డేటా ఇంట్రప్రిటేషన్‌, ఇంగ్లీష్‌లకు సంబంధించి ఒక్కోదానిలో 15 మార్కులకు; లాజికల్‌ రీజనింగ్‌ నుంచి 10 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. రుణాత్మక మార్కులు లేవు. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే కనీసం 50 శాతం మార్కులు రావాలి. 

ఏసెట్‌ నిర్వహణ: ఇది హోమ్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌. ఈ పరీక్ష రాయదలచుకొన్న అభ్యర్థులు సంస్థ నిర్దేశించిన మేరకు హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ సాంకేతికతను అందుబాటులో ఉంచుకోవాలి. 


  • హార్డ్‌వేర్‌కు సంబంధించి పర్సనల్‌ ల్యాప్‌టాప్/డెస్క్‌టాప్‌, 640 x480 @ 15fps రిజల్యూషన్‌ ఉన్న వెబ్‌ కెమెరా, 1 ఎంబీపీఎస్‌ బ్యాండ్‌విడ్త్‌తో వైర్డ్‌/వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌, 2 జీబీ ర్యామ్‌, 2 కోర్స్‌-4 థ్రెడ్స్‌-2.2 గిగా హెర్ట్జ్‌ ప్రాసెసర్‌, 64 ఎంబీ గ్రాఫిక్స్‌ మెమరీ, 1024్ఠ768 కంటే తక్కువ కాకుండా స్క్రీన్‌ రిజల్యూషన్‌, మల్టీ మీడియా సపోర్ట్‌ ఉన్న సౌండ్‌ కార్డ్‌ ఏర్పాటు చేసుకోవాలి. 
  • సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి విండోస్‌ 10/8/7 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, లేటెస్ట్‌ వెబ్‌ బ్రౌజర్‌, 4.5.2 నెట్‌ ఫ్రేమ్‌ వర్క్‌ సిద్దం చేసుకోవాలి.
  • పరీక్ష రాసే సమయంలో ఒరిజినల్‌ అధార్‌ కార్డ్‌ / డ్రైవింగ్‌ లైసెన్స్‌ / పాస్‌పోర్ట్‌ / ఓటర్‌ ఐడీ కార్డ్‌ / పాన్‌ కార్డ్‌లను దగ్గర ఉంచుకోవాలి. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.3,000 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 22

హాల్‌ టికెట్‌/ అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడింగ్‌: నవంబరు 15 నుంచి

ఏసెట్‌ 2022 నవంబరు సెషన్‌ తేదీ: నవంబరు 26 

ఫలితాలు విడుదల: డిసెంబరు 7న

వెబ్‌సైట్‌: www.actuariesindia.org

Updated Date - 2022-10-07T20:27:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising