ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య కళాశాలల ఏర్పాటుకు సహకరించండి

ABN, First Publish Date - 2022-08-25T20:55:27+05:30

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలల(Medical Colleges) ఏర్పాటుకు సహకరించాలని కేంద్రానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని(ap minister Vidadala Rajini) విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర మంత్రికి విడదల రజని విజ్ఞప్తి 


న్యూఢిల్లీ, అమరావతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలల(Medical Colleges) ఏర్పాటుకు సహకరించాలని కేంద్రానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని(ap minister Vidadala Rajini) విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయతో ఆమె భేటీ అయ్యారు. రాష్ట్ర ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యుత్తమ వైద్య విద్య అందించాలనే ఉద్దేశంతో 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పామని, వాటి నిర్మాణానికి అన్ని విధాలా సాయం చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. 10 లక్షల జనాభా దాటిన ప్రతి జిల్లాకు మెడికల్‌ కాలేజీ నిర్మిస్తుండడం అభినందనీయమన్నారని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్‌ వ్యవస్థల గురించి కేబినెట్‌ సమావేశంలో ప్రధానితో చర్చించానని, క్షేత్రస్థాయి పరిశీలన కోసం త్వరలో ప్రధానిని రాష్ర్టానికి తీసుకురావాలని భావిస్తున్నట్టు మాండవీయ తెలిపారన్నారు. 



Updated Date - 2022-08-25T20:55:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising