ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సై, కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌.. కుటుంబానికి రెండే సీపీపీ రిజర్వేషన్లు

ABN, First Publish Date - 2022-06-07T21:54:16+05:30

పోలీసు పోస్టుల నియామకాల్లో ఒక కుటుంబంలో మొదట జన్మించిన ఇద్దరికే చిల్డ్రన్‌ ఆఫ్‌ పోలీస్‌ పర్సనల్‌ (సీపీపీ) ప్రత్యేక రిజర్వేషన్‌ వర్తిస్తుందని పోలీసు నియామక మండలి తెలి పింది. కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు అధికారుల పిల్లల్లే సీపీపీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): పోలీసు పోస్టుల నియామకాల్లో ఒక కుటుంబంలో మొదట జన్మించిన ఇద్దరికే చిల్డ్రన్‌ ఆఫ్‌ పోలీస్‌ పర్సనల్‌ (సీపీపీ) ప్రత్యేక రిజర్వేషన్‌ వర్తిస్తుందని పోలీసు నియామక మండలి తెలి పింది. కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు అధికారుల పిల్లల్లే సీపీపీ రిజర్వేషన్‌కు అర్హులని స్పష్టం చేసింది. రిటైర్డ్‌, చనిపోయిన పోలీస్‌ అధికారుల పిల్లలకు కూడా రిజర్వేషన్‌ వర్తిస్తుందని పేర్కొంది. పోలీస్‌ పోస్టుల భర్తీలో సీపీపీ కింద 3ు ప్రత్యేక రిజర్వేషన్‌ ఉంది. అయితే.. ఒక కుటుంబంలో ఎంతమందికి సర్టిఫికేట్లు మంజూరు చేయాలో యూనిట్‌ ఆఫీసర్లకు స్పష్టత లేదు. దీంతో ఒకే కుటుంబంలోని అనేక మంది పిల్లలు సీపీపీ సర్టిఫికెట్‌ల కోసం సీపీలు, ఎస్పీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. 

Updated Date - 2022-06-07T21:54:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising