ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘విదేశీ విద్య’పై వైసీపీ సర్కారు బుకాయింపు

ABN, First Publish Date - 2022-08-18T16:33:21+05:30

అంబేడ్కర్‌ ఓవర్సీస్‌(Ambedkar overseas) విద్యానిధి పథకంపై వైసీపీ సర్కారు బుకాయింపులకు దిగుతోంది(YCP Government). ఈ పథకం చంద్రబాబు హయాంలో అమలైందని... దానితో పోలిస్తే జగనన్న విదేశీ విద్యాదీవెన భిన్నమైనదంటూ మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అది.. ఇది కాదా?!

‘విదేశీ విద్య’పై అమాత్యుల బుకాయింపు 

అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ పథకానికి వక్రభాష్యం 

అధికారిక ప్రకటనలో అడ్డగోలుగా వక్రీకరణ 

మంత్రి మేరుగ నాగార్జున తీరుపై విమర్శలు 

కాంగ్రెస్‌ హయాంలోనే పథకానికి రూపం

పేరు మార్చకుండా అమలుచేసిన చంద్రబాబు 

అంబేడ్కర్‌ పేరు తొలగించిన వైసీపీ ప్రభుత్వం 

దళిత బాంధవుడి పేరు స్థానంలో జగన్‌ పేరు


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : అంబేడ్కర్‌ ఓవర్సీస్‌(Ambedkar overseas) విద్యానిధి పథకంపై వైసీపీ సర్కారు బుకాయింపులకు దిగుతోంది(YCP Government). ఈ పథకం చంద్రబాబు హయాంలో అమలైందని... దానితో పోలిస్తే జగనన్న విదేశీ విద్యాదీవెన భిన్నమైనదంటూ మంత్రి మేరుగ నాగార్జున సరికొత్త భాష్యం చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన విడుదల చేసిన అధికారిక ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్గదర్శకాలు మార్చినంత మాత్రాన పథకం వేరవుతుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య చదివేవారికి ఆర్థిక సాయం చేసే పథకానికే వైసీపీ ప్రభుత్వం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ పేరు పెట్టింది. గతంలో ఎస్సీ, ఎస్టీలకు విదేశీ విద్యను అందించే పథకానికి అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పేరున్న విషయాన్ని మంత్రి అంగీకరించారు. అంటే పాత పథకం స్థానంలో జగనన్న విదేశీ విద్యాదీవెన వచ్చిందని పరోక్షంగా ఒప్పుకున్నట్లే. అలాగే అంబేడ్కర్‌ స్థానంలో జగన్‌ పేరు వచ్చిన మాట కూడా వాస్తవమే కదా. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు సాక్షాత్తు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్డగోలుగా బుకాయించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 


ఎస్సీ, ఎస్టీలకే అంబేడ్కర్‌ పథకం అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే చెందిందని, జగనన్న విదేశీ విద్యాదీవెన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కూడా సంబంధించిన పథకమని... ఈ రెండూ వేరని మంత్రిగారు సెలవిచ్చారు. అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ కేవలం 15 దేశాలకు సంబంధించినది అయితే విదేశీ విద్యాదీవెన 1 నుంచి 200 క్యూఎస్‌ ర్యాంకులు కలిగిన యూనివర్సిటీలకు వరిస్తుందని చెప్పుకొచ్చారు. అయితే గతంలో ఎస్సీ, ఎస్టీలకు అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ పేరిట, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ పేరుతోనూ పథకాన్ని అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడేళ్ల పాటు దీన్ని నిలుపుదల చేసి, ఇప్పుడు సవాలక్ష నిబంధనలతో పథకాన్ని అమల్లోకి తెచ్చారు. పథకం మార్గదర్శకాలు మార్చారే తప్ప లక్ష్యం విదేశీ విద్య కోసమే అనేది సుస్పష్టం. 


ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద విద్యార్థులందరికీ ఒకే మార్గదర్శకాలను రూపొందించిన వైసీపీ ప్రభుత్వం... జగనన్న విదేశీ విద్యాదీవెన పేరుతో పథకాన్ని అమల్లోకి తెస్తూ జీవో ఇచ్చింది. దీనిపై ‘అంబేడ్కర్‌ ఔట్‌’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ కథనం కూడా ప్రచురించింది. అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ పథకం పేరు మార్చడంపై ప్రతిపక్షాలు సైతం ప్రశ్నిస్తున్నాయి. వాస్తవాన్ని ఒప్పుకోలేని ప్రభుత్వం ఇలాంటి బుకాయింపులకు దిగడం విడ్డూరంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. వాస్తవానికి అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనే ప్రారంభమైంది. 2013 మార్చి 13న, మే 14న ఎస్సీ నోడల్‌ ఏజెన్సీ రెండు దఫాలు సమావేశమై ఈ పథకం కోసం ప్రతిపాదించింది. అదే సంవత్సరం మే 21న ఎస్టీ నోడల్‌ ఏజెన్సీ సమావేశంలోనూ ఎస్టీలకు అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ పథకాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత జూన్‌ 28న సాంఘిక సంక్షేమ శాఖ, జూన్‌ 4న గిరిజన సంక్షేమశాఖ ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీచేశాయి. 


ప్రతి ఏటా ఎస్సీ విద్యార్థులు 500 మందికి, ఎస్టీ విద్యార్థులు 100 మందికి విదేశీ విద్యానిధి అమలు చేయాలని, ఆయా కుటుంబాల వార్షికాదాయం రూ.2లక్షల లోపు ఉండాలని మార్గదర్శకాలు రూపొందించారు. ఆ తర్వాత చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాల పేర్లు జోలికి పోలేదు. అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం అమలును కొనసాగించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా పలు నిబంధనలను సడలిస్తూ మార్గదర్శకాలను సవరించారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ పేరిట బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని విస్తరించడానికి నిర్ణయం తీసుకున్నారు. దీంతో పేరు విషయంలో ఎలాంటి వివాదాలు రాలేదు.


పేరు మార్పుతో విమర్శలు 

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి, ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ పథకాలను నిలిపేశారు. దాదాపు అదే మార్గదర్శకాలతో కొత్తగా ప్రారంభించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కొత్తగా పెట్టిన పథకానికి జగనన్న విదేశీ విద్యాదీవెన పేరు పెట్టారు. అప్పటి వరకు అమల్లో ఉన్న అంబేడ్కర్‌ పేరు తొలగించడంపై అన్ని వర్గాలు మండిపడ్డాయి. ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా దళితుల ఒత్తిడితో కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు తగిలించిన జగన్‌ సర్కారు... విదేశీ విద్య పథకానికి రాజ్యాంగ నిర్మాత పేరును తొలగించడంపై తీవ్ర విమర్శలొచ్చాయి. దీన్ని సమర్థించుకుంటూ మంత్రి మేరుగ నాగార్జున అధికారిక ప్రకటన ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Updated Date - 2022-08-18T16:33:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising