ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2వేల మంది నిరుపేద విద్యార్థులకు ఆకాశ్ బైజూస్ జాతీయ స్కాలర్‌షిప్

ABN, First Publish Date - 2022-08-13T00:49:32+05:30

టెస్ట్‌ ప్రిపరేటరీ సేవలలో జాతీయ అగ్రగామి సంస్థ ఆకాశ్ బైజూస్‌ ‘ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌’ కార్యక్రమం ద్వారా ఉన్నత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టెస్ట్‌ ప్రిపరేటరీ సేవలలో జాతీయ అగ్రగామి సంస్థ ఆకాశ్ బైజూస్‌ ‘ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌’ కార్యక్రమం ద్వారా ఉన్నత విద్య కోసం ప్రైవేట్‌ కోచింగ్‌ను  అందిస్తోంది. తద్వారా బాలికలకు సాధికారత అందించేందుకు  ANTHE  2022 పేరుతో  భారీ కార్యక్రమం ప్రారంభించింది. దీనిద్వారా 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు, మరీ ముఖ్యంగా బాలికలలో రెండు వేల మందికి  ఉచితంగా నీట్‌, జేఈఈ కోచింగ్‌ను అందించనుంది. ANTHE అనేది ఒక గంట పాటు జరిగే పరీక్ష. ఇది ఈ ఏడాది నవంబరు 5-13  తేదీల మధ్య జరుగుతుంది. ఆన్‌లైన్‌లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పరీక్ష తేదీలలో నిర్వహిస్తారు. అలాగే, ఆఫ్‌లైన్ పరీక్షను నవంబరు 6 నుంచి 13వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు దేశవ్యాప్తంగా ఆకాశ్ బైజూస్‌కు ఉన్న 285 కేంద్రాలలో నిర్వహిస్తారు. విద్యార్థులు తమకు అనుకూలమైన సమయం ఎంచుకుని పరీక్ష రాయవచ్చు. ఇందులో మొత్తం 90 మార్కులు ఉంటాయి. 35 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇవి విద్యార్థుల గ్రేడ్, స్ట్రీమ్స్‌కు అనుగుణంగా ఉంటాయి.


ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో ఏక కాలంలో ఆవిష్కరించగా, ప్రధాన కార్యక్రమం ఢిల్లీలోని ఏరోసిటీ వద్దనున్న జేడబ్ల్యూ మారియట్‌ హోటల్‌లో జరిగింది.  ఈ కార్యక్రమంలో చైర్మన్ జేసీ చౌదరి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆకాష్‌ చౌదరి, సీఈఓ అభిషేక్‌ మహేశ్వరితోపాటు ఆకాష్‌ బైజూస్‌,  ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  


లబ్ధిదారులైన విద్యార్థులను గుర్తించడంలో భాగంగా ఆకాశ్ ఇప్పుడు ఎంపిక చేసిన ఎన్‌జీవోలతో భాగస్వామ్యం చేసుకుంది. ఈ ఎన్‌జీఓలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులను నామినేట్‌ చేస్తారు. బాలికలను, సింగిల్‌ పేరెంట్‌ (తల్లులు మాత్రమే) కలిగిన వారిని సూచిస్తారు. ఆకాష్‌ బైజూస్‌‌కు భారతదేశ వ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఉంది. దాదాపు 285కు పైగా కేంద్రాలు దేశంలో ఉన్నాయి. దేశంలో మరే ఇతర కోచింగ్‌ కేంద్రానికీ ఇన్ని కేంద్రాలు లేవు.  

Updated Date - 2022-08-13T00:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising