1998 DSC అభ్యర్థులకు టీచర్ పోస్టులు
ABN, First Publish Date - 2022-06-18T16:54:06+05:30
1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించే ఫైలుపై సీఎం జగన్ సంతకం చేశారు. నాటి డీఎస్సీలో పలువురు ఉద్యోగాలు పొందినా దాదాపు 4,534 మంది అభ్యర్థులు పలు కారణాలతో ఉద్యోగాలు పొందలేదు. అప్పటినుంచీ వారు పోరాడుతున్నారు..
మినిమమ్ టైమ్‌స్కేల్ వర్తింపునకు నిర్ణయం
అమరావతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): 1998 డీఎస్సీ అభ్యర్థుల(DSC candidates)కు ఉపాధ్యాయ ఉద్యోగాలు(Teacher posts) కల్పించే ఫైలుపై సీఎం జగన్(cm jagan) సంతకం చేశారు. నాటి డీఎస్సీలో పలువురు ఉద్యోగాలు పొందినా దాదాపు 4,534 మంది అభ్యర్థులు పలు కారణాలతో ఉద్యోగాలు పొందలేదు. అప్పటినుంచీ వారు పోరాడుతున్నారు. వారికి కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా అవకాశం ఇస్తామని గతంలోనే వాగ్దానం చేశారు. ఇప్పుడు వారికి ఆ మేరకు కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా అవకాశం ఇస్తూ సీఎం సంతకం చేశారు. వీరికి మినిమమ్ టైమ్ స్కేలు(రూ.33 వేలు)ను వర్తింపజేయనున్నారు. సీఎం నిర్ణయంపై పీడీఎఫ్ ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. లక్ష్మణరావు, యండపల్లి శ్రీనివాసులురెడ్డి, ఐ. వెంకటేశ్వర్‌రావు, షేక్ సాబ్జీలు హర్షం వ్యక్తంచేశారు.
Updated Date - 2022-06-18T16:54:06+05:30 IST