ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంపు ప్రజలకు మేలు చేసేలా ఆలోచించాలి

ABN, First Publish Date - 2022-08-03T06:19:05+05:30

రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు ముంపు గురించి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాయి. బిల్లును చట్టంగా ఆమోదించే సమయంలోనే ఓయు విద్యార్థి జేఏసీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు ముంపు గురించి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాయి. బిల్లును చట్టంగా ఆమోదించే సమయంలోనే ఓయు విద్యార్థి జేఏసీ (జనరల్) భద్రాచలానికి సంబంధించిన ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల ప్రాంతాలు తెలంగాణాలో భౌగోళికంగా ఉన్నాయని, ఇవి ఆంధ్రాకు ఇవ్వడం ద్వారా సమస్యలు ఎదురవుతాయని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించి, రిప్రజెంటేషన్ ఇచ్చింది. అయితే అప్పుడు కేంద్రంలోను, రాష్ట్రంలోను ఉన్న ప్రభుత్వాలు ముంపు ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌లోకి తీసుకోవడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య ముంపు వివాదాలు పరిష్కరించాలన్న ఆలోచన తప్ప, క్షేత్రస్థాయిలో ఈ ప్రాంతాలు ఎక్కడున్నాయో కూడా అవి గమనించలేదు. గత ఎనిమిది సంవత్సరాలుగా విద్యకు, వైద్యానికి, ఉపాధి తదితర విషయాల్లో ఈ ఐదు పంచాయతీలు వందేళ్లు వెనక్కు వెళ్లిపోయాయి. ఈ ప్రాంతాల ప్రజలకు పదో తరగతి పాఠశాల 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైద్యానికి భద్రాచల ప్రభుత్వ ఆసుపత్రే ఇప్పటికీ దిక్కు. ప్రభుత్వాల అవగాహనా రాహిత్యం, కిందిస్థాయి అధికారుల తప్పుడు నివేదికల వల్ల ఈ ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఈ సమస్యలను ముందే గుర్తించిన ఓయూ జేఏసీ నేటి వరకూ పోరాటాలు కొనసాగిస్తూనే ఉంది.


ఇటీవలి గోదావరి వరద ముంపుతో ప్రజలు, స్థానిక నాయకులు, ఆంధ్రా–తెలంగాణ మంత్రుల్లో ఒక కదలిక వచ్చింది. ఇరు రాష్ట్రాల నాయకులు, మంత్రులు దీనిని చిత్తశుద్ధితో పరిష్కరించవలసిన సమస్యగా గుర్తించాలి. ఈ కనెక్టివిటీ సమస్యకు, పోలవరం డ్యాంకు సంబంధం లేదు. ఒకరి మీద ఒకరు బురద చల్లుకునే రాజకీయాలు కాకుండా, ఈ ఐదు పంచాయతీల ప్రజలకు న్యాయం చేసేలా నాయకులు ఆలోచించాలి. కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ సమస్యను క్షణ్ణంగా పరిశీలించి ఈ ఐదు పంచాయతీలను తెలంగాణకు అప్పగించాలి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాల ప్రజలకు పూర్తిస్థాయి సౌకర్యాలు ఏర్పరచలేదు. కాబట్టి వాస్తవాలను గ్రహించి, భేషజాలకు పోకుండా ఈ ఐదు పంచాయతీలను తెలంగాణకు అప్పగిస్తే ఇక్కడి ప్రజలకు మేలు చేసిన వారవుతారు.

గడ్డం శ్రీరామ్

(ఓయు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు)

Updated Date - 2022-08-03T06:19:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising