ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెలితి

ABN, First Publish Date - 2022-06-20T06:11:04+05:30

ఈ ఊరిని మరో చోటికి తీసికెళ్లేవి పక్షులే. నువ్వూ అంతే ఎక్కడికి వెళ్లినా నువ్వు గానే ప్రత్యక్షమౌతావు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ ఊరిని

మరో చోటికి తీసికెళ్లేవి

పక్షులే.

నువ్వూ అంతే

ఎక్కడికి వెళ్లినా

నువ్వు గానే ప్రత్యక్షమౌతావు.


చావు కబురు గాలి మీదెక్కి

స్వారీ చేస్తుంది.

బహుశా ఈ వర్షం

దాని తాలూకు దుఃఖం కావచ్చు.


పల్లెకూ నగరానికీ మధ్య

కలతల ప్రయాణం అసామాన్యం

తారతమ్యాల నడుమ

బతుకు నలిగిపోతుంది.


వలసపోతున్న కూతురు సంచిలో

కొన్ని నోట్లు కుక్కుతుంది తల్లి

బహుశా అవి సర్కారిచ్చే

పింఛన్‌ డబ్బుల్లోంచి కావచ్చు.


ఒంటరితనాన్ని

మూసినకళ్లలో బంధించి కూర్చుంటుంది.

ఇది చింతనలో మునిగిన

రుషి కన్న తక్కువదేం కాదు.


గడిచిన జీవితాన్ని

వెంటబెట్టుకెళ్లేవి జ్ఞాపకాలే

‘బాగేనా’ అంటే

ఆ మాటకు అర్థం లేదు

ఉన్నా అవి

వారి వారి నిర్వచనాలు.


చిన్న ఊరి సందులనూ

నగరంలోని రాకాసి రోడ్లనూ

పోలుస్తూ చూడొద్దు.

ఆ రెంటి తేడాలోనే

నరక లోకపు నవ్య యాతనలు.


ఈ రెక్కలకు

కొత్త బతుకుతెరువును

నేర్పటం అంత సులభం కాదు.

ఇక్కడలేని దేదో అక్కడుంది.

వెలితిని దేనితో నింపాలో తెలియదు.


ఒకటి మాత్రం నిజం

ఈ కళ్లల్లోని వెలుగు పాపలకు

ఏదో పద్యంలాంటి నేపథ్యముంది.

ఇవాళ కాలాన్ని

వస్త్రగాళం పట్టి చూద్దాం

మిగిలిన క్షణాల నిండా

రగిలేది మాత్రం ప్రేమే.

ఎన్‌. గోపి


Updated Date - 2022-06-20T06:11:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising