ఈ వారం వివిధ కార్యక్రమాలు 17 10 2022
ABN, First Publish Date - 2022-10-17T07:31:09+05:30
రంగినేని ఎల్లమ్మ పురస్కారం వేదగిరి రాంబాబు పురస్కార ప్రదానం ఉగాది నవలల పోటీ...
రంగినేని ఎల్లమ్మ పురస్కారం
2022 సంవత్సరానికి ‘రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం’ ఎంపిక కోసం 2020, 2021, 2022 సంవత్సరాలలో ప్రచురితమైన తెలుగు కథా సంపుటాలు ఐదు ప్రతులను నవంబరు 30, 2022 లోపు అందేట్టు పంపగోరుతున్నాము. విజేతకు అవార్డుగా రూ.25వేల నగదు, జ్ఞాపిక, పురస్కార పత్రం ఇస్తారు. కథా సంపుటాలను చిరునామా: అధ్యక్షులు, రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం 2022, రంగినేని సుజాత మోహన్ రావు ఎడ్యుకేషనల్‌్క్షచారిటబుల్ ట్రస్ట్, బాలాజి నగర్, సిరిసిల్ల - 505 301కు పంపాలి.
మద్దికుంట లక్ష్మణ్
వేదగిరి రాంబాబు పురస్కార ప్రదానం
వేదగిరి రాంబాబు పురస్కారాల ప్రదా నోత్సవం, ‘మా కథలు 2021’ పుస్తకావిష్క రణ అక్టోబరు 14 ఉ.10గం.లకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుది. ఆకెళ్ళ వెంకటసుబ్బలక్ష్మి, ‘బహుశా’ వేణు గోపాల్ పురస్కారాలను అందుకుంటారు. సభలో కె.వి. రమణాచారి, విహారి, వాణిశ్రీ తదితరులు పాల్గొంటారు.
సింహప్రసాద్
ఉగాది నవలల పోటీ
పిడపర్తి వెంకట రమణ శర్మ జ్ఞాపకార్థం 2023 ఉగాది - సాంఘిక నవలల పోటీకి నవలలను ఆహ్వానిస్తున్నాం. కథాంశం ఏదైనా నవ్యతకు, సృజనాత్మకతకు ప్రాము ఖ్యతనివ్వాలి. కేవలం సందేశం కోసమే రాసిన నవలలకూ, శీర్షికలోనే కథాంశం తెలియజేసే నవలలకూ విజయావకాశాలు తక్కువ ఉంటాయని గమనించాలి. 3 ఉత్తమ నవలలు ఒక్కొకటీ రూ.25వేలు, 3 సాధారణ నవలలు ఒక్కొక్కటి రూ. 15వేలు బహుమతులు పొందుతాయి. నవలల నిడివి ఏ4 ప్రింటులో 100-300 పేజీలమధ్య ఉండాలి. నవలలను యూని కోడ్ లేదా అనుఫాంట్స్‌లో టైప్ చేసి, లేదా స్కాన్ చేసి డిసెంబరు 31లోగా ఈమెయిల్: ుఽౌఠ్ఛిజూట2023ఃజుౌఠఝఠఛీజీ .ుఽ్ఛ్టకు పంపాలి. ఫలితాలు మార్చి 2023 ఠీఠీఠీ.జుౌఠఝఠఛీజీ.ుఽ్ఛ్ట లో వస్తాయి.
కౌముది వెబ్ మాసపత్రిక
శేషేంద్ర జయంతి సదస్సులు
మహాకవి శేషేంద్ర శర్మ 96వ జయంతి సందర్భంగా అక్టోబర్ 20న హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవి ద్యాలయంలో మ.3గం.లకు జయంతి ఉత్సవం, ‘నా డైరీ రక్తరేఖ’ పుస్తకావిష్క రణ జరుగుతుంది. ఈ సభలో తంగెడ కిషన్ రావు, అనుమాండ్ల భూమయ్య, బానాల మన్మథరెడ్డి తదితరులు పాల్గొం టారు. అక్టోబరు19న సహృదయ సాహితి విశాఖపట్నంలో శేషేంద్ర జయంతి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో వెలమల సిమ్మన్న, డివి సూర్యారావు ప్రసంగాలు ఉంటాయి. అక్టోబరు 21న హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో జయంతి సభ జరుగుతుంది. ఈ సభలో మధుసూదనాచారి, వడ్డేపల్లి కృష్ణ తదిత రులు పాల్గొంటారు.
సాత్యకి
Updated Date - 2022-10-17T07:31:09+05:30 IST