ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ వారం వివిధ కార్యక్రమాలు 02-05-2022

ABN, First Publish Date - 2022-05-02T05:54:52+05:30

‘జాల’ కన్నడ కథలు గడువు పొడిగింపు కవితల పోటీ ఫలితాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘జాల’ కన్నడ కథలు

పెద్దింటి అశోక్‌కుమార్‌ కథలకు ఎం.జి.శుభమంగళ కన్నడ అను వాదం ‘జాల’ ఆవిష్కరణ సభ మే 8న  రవీంద్ర కళాక్షేత్రం, కన్నడ భవనం, బెంగుళూరులో జరుగుతుంది. సభలో రఘునాథ. చ.హ., ఆర్‌. పూర్ణిమా, జి.రామ కృష్ణ  పాల్గొంటారు. 

వంశీ పబ్లికేషన్స్‌


గడువు పొడిగింపు

తెలంగాణ సారస్వత పరిషత్తు 2022 సంవత్సరానికి నిర్వహిస్తున్న ఉత్తమ గ్రంథాల పోటీకి పుస్తకాలు పంపే గడువును మే 10వ తేదీకి పొడిగించారు. 2020, 2021 సంవత్సరాల్లో మొదటి ముద్రణ పొందిన విమర్శా గ్రంథాలు, కథా సంపుటాలు, కవితా సంపుటాలు, పద్య గేయ కవితా సంపుటాలు, నవలలు, ఇతర విభాగాల పుస్తకాలు మూడు ప్రతులను చిరునామా: తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్‌ రోడ్‌, అబిడ్స్‌, హైదరాబాద్‌-1కు పంపాలి. 35 ఏళ్ల లోపు వారు తమ గ్రంథమేదైనా యువ పురస్కారానికి పంపవచ్చు. 

జుర్రు చెన్నయ్య


కవితల పోటీ  ఫలితాలు

సృజనప్రియ మాసపత్రిక నిర్వహించిన కవితల పోటీలో ఎంపికైనవారు: మొదటి, రెండవ, మూడవ బహుమతు లకు వరుసగా సాంబమూర్తి లండ, కలమట దాసుబాబు, వేముగంటి మురళి. కథల పోటీలో ఎంపికైనవారు: మొదటి, రెండవ, మూడవ బహుమతులకు వరుసగా ఎమ్‌.సుగుణారావు, రత్నాకర్‌ పెనుమాక, తటవర్తి నాగేశ్వరి. 

దేశరాజు 

రచనలకు ఆహ్వానం 

స్వర్గీయ పీచర సునీతా రావు పురస్కారాల కోసం కవిత్వం, కథలు, విమర్శ విభాగాల నుంచి సంపుటులను ఆహ్వానిస్తున్నాం. ప్రతి సంపు టానికి రూ.15వేల నగదు జ్ఞాపిక, సత్కారం ఉంటుంది. మార్చ్‌ 2019 - మార్చ్‌ 2022 మధ్య వెలువడిన రచనలను మే 18లోగా చిరునామా: టి.మన్మోహన్‌రావు, ఇం.నెం.1-5-431/2/16/, రామేశ్వర్‌ నగర్‌. కాలనీ, జోన్నబండ, ఓల్డ్‌ అల్వాల్‌-500010. ఫోన్‌: 98486 98699కు పంపాలి.

కాంచనపల్లి గోరా


Updated Date - 2022-05-02T05:54:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising