ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుండ

ABN, First Publish Date - 2022-09-12T05:47:53+05:30

పెదవులు తడుపుకుందామనుకుంటే నాలుక కదలడంలేదు లాలాజలం ధ్రువాల దగ్గరి మంచులా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదవులు తడుపుకుందామనుకుంటే

నాలుక కదలడంలేదు

లాలాజలం ధ్రువాల దగ్గరి

మంచులా గడ్డకట్టుకుపోతోంది


ఎన్నేళ్ళదో వెర్రి దాహం, తీరనేలేదు

కుంపట్లో నిప్పులా ఆరనే లేదు

మిట్టమధ్యాహ్నం ఎండనై

గుక్కెడు నీళ్ళ కోసం అరచేతుల్నెంత

వినయంగా వొంచి నిలబడ్డాను

ఏ నది కాళ్ళు పట్టుకున్నా దయచూపలేదు


మైళ్ళ దూరం నడచి

గాఢ నిద్రల్ని కాచి

దాహపడ్డం ఏకలవ్యుడిలా నేర్చుకున్న విద్య

ఈ గాలిలో ఎన్ని మబ్బుతునకలు ఆవిరైపోయాయి

దాహపు క్షణాలపై కాలానికెంత గాయమయింది


ప్రేమించిన సహచరుల్ని చేజార్చుకోవడం

సగం చదివిన పుస్తకాన్నై కాలిపోవడం

నన్ను నేనీ దప్పికలోనే

ఎడారి గొంతుకనై పిడచగట్టుకుపోయి

ఎన్నిసార్లు ఉరి బిగించుకున్నాను


తీరని కాంతి దాహార్తిలో

పెనుగులాడిన సూర్యోదయాన్ని

ఉప్పు కెరటాల నీలిమల్ని

లేపనం రాసుకున్న సముద్రాన్ని

చెంపదెబ్బ తిన్న పిల్లవాడొకడు

వేసవి పక్షిలా నేల రాలిపోయినపుడు

రాజ్యంలో పారే సెలయేళ్ళు నోళ్ళు విప్పలేదు

దూప తీరని వాడి కలల శాశ్వత నిద్రపై

ఇంత పెద్ద ఆకాశం చినుకైనా రాల్చలేదు

హిమాలయాలు బానిసత్వ 

    శిఖరాగ్రాల్లా నిలబడ్డాయి

విశ్వవిద్యాలయాలన్నీ బావిలో కప్పలయినాయి


కడబంతి దాకా వేచి చూసిన ఆకలి లాగే

దాహానిది కూడా అతిప్రాచీనమైన దుక్ఖ లిపి

నోటికీ పొట్టకీ మధ్య పంటబోదె ఎండినట్లు

అన్నవాహికలోంచి తల్లుల నిస్సహాయ గీతాలాపన

ఉబ్బిన పసివాడి కనురెప్పల జారిన

చిట్టచివరి కన్నీటి చుక్కలతో

భూమి ప్రాణం విలవిల్లాడుతుంది

బువ్వకుండై గుండె పగిలిపోతుంది

నేనీ దేశపు మట్టి రేణువుల్లోంచి

శ్వాశ తీసుకుంటున్నందుకు ఆర్ద్రమవుతున్నాను.

విచ్చు మొగ్గలైన దాహపు మెతుకుల్ని

కుమ్మరి చక్రం మీద మళ్ళీ

ఒడుపుగా అన్నం ముద్ద చేస్తున్నాను

శ్రీరామ్‌

99634 82597


Updated Date - 2022-09-12T05:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising