ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన తెలుగును మరచిపోతున్నాం

ABN, First Publish Date - 2022-07-02T08:35:39+05:30

తెలుగు భాషను మన ఇళ్లలో మాట్లాడటం మానేశాం. చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మరచిపోతున్నాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు భాషను మన ఇళ్లలో మాట్లాడటం మానేశాం. చిన్నతనంలో విన్న, వాడిన తెలుగు మాటలు మనమే మరచిపోతున్నాం. నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లలకు నేర్పించాల్సింది పోయి, మనమే మారిపోతున్నాం. మన ఇళ్ళకు చుట్టాలు, బంధువులు రావడం లేదు.. గెస్ట్ లే వస్తున్నారు. గెస్ట్ రూములు ఉన్నాయి. ఆ వచ్చిన వాళ్ళు మన ఇంట్లో అన్నం తినరు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేస్తారు. భోజనానికి కూర్చున్నాక కంచాలు పెట్టటం మానేసి ప్లేట్లు పెడుతున్నాం. అందులో వడ్డించేవి రైస్, కర్రీ, గ్రేవీ, ఫ్రైలు మాత్రమే. అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు, తినండి అంటే, ఇంకేమన్నా ఉందా, వాళ్ళేమనుకుంటారో! దుకాణానికి వెళ్ళేటప్పుడు సంచి తీసుకెళ్ళం. బ్యాగ్ పట్టుకుని షాప్‍ కు వెళ్తున్నాం. అందులో వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేసుకుంటాం. కూరగాయలు, పళ్ళు పాడైపోయినాయి.


టీవీ వంటల కార్యక్రమంలో ‘‘కొంచెం సాల్ట్, మిర్చి పౌడర్, ధనియా పౌడర్, జింజర్-గార్లిక్ పేస్ట్ యాడ్‍చేసి ఫైవ్ మినిట్స్ కుక్ చెయ్యలి, స్టౌవ్ ఆఫ్‍ చేసి మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చెయ్యాలి’’ ఇట్లా చెబుతుంది. మరి మన కూరలకు అల్లం, వెల్లుల్లి, ఉప్పూకారాల రుచులు ఎట్లా తగులుతాయి. పేస్ట్ అంటే ఏందో అర్థం కాని విచిత్ర పరిస్థితి. కాగితాలను అంటుపెట్టేదా, పళ్ళు తోముకునేదా, కంప్యూటర్ పరిజ్ఞానంలో ఉపయోగించేదా. ఏదైనా వస్తువులను అతికించేదా! ఈ పేస్టులన్నింటికీ ఇంగ్లీషులో ఒకటే స్పెల్లింగ్! ‌మనం మన ముందు తరాల వారికి తెలుగు భాష సజీవంగా ఉంచి అందించడానికి అందరం తెలుగులోనే మాట్లాడాలి లేకపోతే మన భాషను మనమే చంపిన వాళ్ళం అవుతాం. 


– దండంరాజు రాంచందర్ రావు

Updated Date - 2022-07-02T08:35:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising