ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరుదైన ప్రపంచాల ఆవిష్కరణగా తానా నవలలు

ABN, First Publish Date - 2022-09-26T06:12:33+05:30

హిజ్రాల గురించి నవల రాస్తా నని నేను ఎప్పుడూ అనుకోలేదు. ట్రాన్స్‌జెండర్‌ నవల మొదలుపెట్టే ముందు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్ధనారి

హిజ్రాల గురించి నవల రాస్తా నని నేను ఎప్పుడూ అనుకోలేదు. ట్రాన్స్‌జెండర్‌ నవల మొదలుపెట్టే ముందు నవల స్వభావాన్ని కుటుంబ సభ్యులకు వివరించి ఇరకాటం నుండి బైటపడే ప్రయత్నం చేసినాను. అయినప్పటికీ నవల రాస్తున్నంత కాలం హాయిగా మాత్రం లేను. ‘కోహం’ అని తత్వ విచారణ చేసుకోకుండా ఈ భయావహ చీకటి జీవితాలతో నాకేం పని అనికూడా అనిపించింది. కానీ బీభత్సం కూడా నవరసాల్లో ఒకటి కదా. నా ఐదు నవలలకు భిన్నంగా ‘అర్ధనారి’ నవలను కొత్త శిల్పంతో రాసే ప్రయత్నం చేయ వల్సి వచ్చింది. ఈ సందర్భంలో నా గురువు అయిన ఆర్‌.ఎస్‌. సుదర్శనంగారు చెప్పిన నవలాశిల్పం ఒకటి గుర్తుకువచ్చింది. నవలలో కథనం ఉంటుంది. ఆ కథనంలో కథకుడి విశ్లేషణతోపాటు పాత్రల ఆలోచనలు కూడా కలిసి వుంటాయి. అదీ ఆ శిల్పంలోని నవ్యత. హిజ్రాల నుండీ, సెక్స్‌ వర్కర్ల నుండీ రచయితలు ఆవిర్భవించే లోపల సాహిత్యంలో ఏర్పడిన ఒక ఖాళీని కొంతలో కొంతైనా నింపజూసే ప్రయత్నమే ఈ నవల. 

బండి నారాయణ స్వామి


మున్నీటి గీతలు

చేపలు పట్టడానికి సిక్కోలు మత్స్యకారులు గుజరాత్‌ దాకా పోవడం ఏంటి? పడమర కడలిలో నిండు జీవితాలను అస్తమయం చేసుకోవడం ఏంటి? ఇదంతా పిడికెడు గింజల పొట్ట కోసమేనా? ఈ ప్రశ్నలు నన్ను నులుచుకు తిన్నాయి. పోనీ, ఆలోచించకుండా ఉందామా అంటే ఒక్కరు కాదు. ఇద్దరూ కాదు. లెక్కకు మిక్కిలిగా గంగపుత్రులు ప్రతీ ఏటా బంగాళాఖాతం వదిలేసి పశ్చిమసంద్రానికి పొలోమని వలస పోతూనే ఉన్నారు. ఇంతకీ గుజరాతు ఏలికలేమైనా ముదురు టెంకలా! ఆంధ్రా పాలకులు లేవడి నౌజులా!! అక్కడా సముద్రమే ఉంది. ఇక్కడా సముద్రమే ఉంది. జాలర్ల క్షేమం కోసం ఇబ్బడి ముబ్బడిగా అక్కడ వెలసిన చేపల రేవులు, జెట్టీలు, హార్బర్లు ఇక్కడెం దుకు కట్టుబడికి నోచలేదు. కష్టాల్లో జన్మించి, కల్లోలాల్లో జీవించి, కడగండ్లలోనే కడతేరిపోతున్న వలస జాలర్ల ఉనికిని విపులంగా చెప్పాలనుకున్నాను. భక్తితో రాశాను. అనురక్తి తోనూ రాశాను. ఇంక ఈ నవలా సారాన్ని పైకి తీయ వలసింది పాఠకులే.  

చింతకింది శ్రీనివాసరావు

(తానా బహుమతి పొందిన ఈ రెండు నవలల ఆవిష్కరణ సెప్టెంబరు 26న సా.6.15ని.లకు తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది.)


Updated Date - 2022-09-26T06:12:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising