ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీవెన

ABN, First Publish Date - 2022-05-15T05:30:00+05:30

ఎంతో చక్కగా, ఆరోగ్యకరంగా, లేత ఎండలోని ఒక మొక్కలాగా. మిలమిలా మెరుస్తూ, ఎన్నో మాటలు కూడా చెబుతావు నువ్వు, అడవిలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎదుగుతావు నువ్వు: ఎంతో చక్కగా, ఆరోగ్యకరంగా, లేత ఎండలోని ఒక మొక్కలాగా. మిలమిలా మెరుస్తూ, ఎన్నో మాటలు కూడా చెబుతావు నువ్వు, అడవిలో చెట్లగుంపు మధ్యగా జలజలా పారే సెలయేరులాగా, దాని సవ్వడిలాగా. ఒక ఇంద్రజాలికుడివి నువ్వు మరి అప్పుడు. ఒక ఇంద్రధనుస్సువి కూడా నువ్వు, అప్పుడు. అబ్బురంతో చూస్తాను నిన్ను నేను: జింకలాగా దుమికే, పరిగెత్తే, కుదురసలే లేని ఉడతలాంటి నిన్ను - నీ అరచేతులు, గాలిలో దిశలు మారుతూ నాట్యం చేసే పిట్టలు అప్పుడు. నీ పెదిమలు, మాటల్ని పరిమళంతో నవ్వే లేత ఎరుపు పూరేకులు! ఇక నీ కళ్ళు, అవి తెల్లని చేపపిల్లలు. క్షణకాలం ఆగి, వెనువెంటనే తటాలున కదిలి ఎటో వెళ్లిపోయే కుందేలు పిల్లలు కూడా నీ కళ్ళే. తోటల్లో, గాలికి చిన్నగా హాయిగా ఊగే పూల నీడలూ, వాటి సంరంభం కూడా ఇక నీ కళ్ళలోనే, నీ చిట్టి పొట్టి మాటలలోనే -మరిక, ఇలా ఎన్నో చెప్పి, ఎన్నో చేసీ, ఎంతో నవ్వీ, చిన్నపాటి తూగుతో నువ్వు రాత్రిలోకీ, అమ్మ ఒడిలోకి నిద్రవై జారితే, నాకు ఎందుకో, ఊగీ ఊగీ నిశ్చలమయ్యే, వెన్నెల్లో తడిచిన వరికంకి ఒకటి జ్ఞాపకం వచ్చింది. వానగాలికి చూరుపై ముడుచుకునే, ఒక బుజ్జి పిచుక కూడా గుర్తుకు వచ్చింది. చలి రాత్రుళ్ళల్లో, నెగడు చుట్టూ చేరి, చేతుల్నీ, హృదయాల్నీ మరి వెచ్చబరుచుకున్న ఆప్తమైన క్షణం కూడా ఏదో సువాసనై లేతగా సోకింది. కాలం అలా ఆగిపోయింది. ఇక అప్పుడు, బయటా, నా లోపలా నీరెండలోని యూకలిఫ్టస్‌ చెట్ల వాసనా, మసక కాంతీ, కరుణా, జీవన లాలస -


ఇలాగే ఎదగాలి నువ్వు: ఎంతో చక్కగా, సహజంగా, జీవితం మరి ఒక తురాయి చెట్టై, వేనవేల పూలతో నీలోంచి ఇతరులకై భళ్ళున, తళతళా వికసించేటట్లు, పూలవానల్లో, ఆ రంగుల్లో ఈ లోకాన్ని నీ లేత చేతులతో కడిగి పునర్జీవింపజేసేటట్లూ -చిన్నా, ఇలాగే వెళ్ళిపోవాలి నేను. ఇలాగే విముక్తం కూడా కావాలి నేను: మరి, కృతజ్ఞతతో, ప్రేమతో, నదులలాంటి చల్లని నీ అరచేతులలో, నా చివరి క్షణంలో నిన్నే చూస్తూ, ఇంతకాలం నేను తపించిన, నాకు లభించని, శాంతితో!


శ్రీకాంత్‌

Updated Date - 2022-05-15T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising