ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లె పెద్ద కుటుంబమైంది...!

ABN, First Publish Date - 2022-01-15T06:28:58+05:30

ముత్యాల మేలి ముసుగేసుకుని ప్రకృతి అందంగా ముస్తాబైంది.. శీతాకాలం చలి గాలులతో చక్కిలి గింతలు పెడుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముత్యాల మేలి ముసుగేసుకుని ప్రకృతి అందంగా ముస్తాబైంది

శీతాకాలం చలి గాలులతో చక్కిలి గింతలు పెడుతోంది

పుష్యమాసం పుష్పమాసమై పరిమళంతో విరాజిల్లుతోంది

హాలికుల ఆలయాన పౌష్యలక్ష్మి కొలువైంది

పల్లెలోని ప్రతి ఇల్లు ధాన్యరాశులకు నెలవైంది

శ్రమైకజీవుల కళ్ళల్లో ఆనంద కాంతి సంకురాత్రి సంబురమైంది

బసవన్న కాలి అందెల సవ్వడి శుభమస్తు అన్న దీవెననిచ్చింది

బుడబుక్కలవాని మాట జంగందేవర ఢమరుక డబుడక్కల నాదం 

హరిదాసు కీర్తన జానపద కళకి సంస్కృతికి పల్లె పట్టం కట్టింది

పిండివెన్నెల తివాచీపై గుమ్మడి పువ్వు కీరిటంతో గొబ్బెమ కూర్చుంది

భోగిమంట నులివెచ్చని వేడిని ఒంటికి పులుముకోమంది

కాగితపు పిట్ట అంబరాన్ని అందుకోవాలని తహతహలాడింది

తరతమ బేధాలను మరచి పల్లె పెద్ద కుటుంబమైంది

భోగిపళ్ళు బొమ్మల కొలువులు పడుచుపిల్లల పరిహాసపు పరవళ్ళతో

తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి సందడి.



– శ్రీధర్ వాడవల్లి

Updated Date - 2022-01-15T06:28:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising