ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెమటపద్యం

ABN, First Publish Date - 2022-04-04T06:46:20+05:30

నెత్తిమీద మాయారక మునుపే గాసముండి గొడ్డుసాకిరీజేసి బత్కంత మట్టిపాలైన మానాన్న ఇప్పటికీ భూతల్లి రుణమెట్లాదీర్చాల్నో ఆలోచిస్తడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెత్తిమీద మాయారక మునుపే

గాసముండి

గొడ్డుసాకిరీజేసి బత్కంత మట్టిపాలైన మానాన్న

ఇప్పటికీ భూతల్లి రుణమెట్లాదీర్చాల్నో ఆలోచిస్తడు.


ఒండుమట్టికోసం కోడికూతకు ముందే

ఎద్దులకొట్టంలో ఎన్నెలై పొడుస్తాడు మా నాయిన.


కొట్టంలోనే మాసారి తెగిన పగ్గంపేనుకొని 

గుంజకు తగిలించిన సెలకాలను భుజంపై ఏసుకోని

బండెద్దులుగట్టుకొని ఆకలిరాగమొకటి ఎత్తుకుంటాడు.


కరిగేటులో ఎద్దుకాలిరిగిన 

తుమ్మముల్లును

కొనగోటికందకుంటే మునిపంటితోదీసి

ఎద్దులు నాబిడ్డలేనని యదపై చేయ్యేసుకొని మురిసిపోయే 

                  పొద్దుపొడుపు నవ్వు మా నాయిన.


చెరువు మట్టిని గంపలతో ఎత్తి

మట్టిపెడ్డలను బువ్వముద్దలుగా సూసుకుంటాడు

బండి బండికో ముసలితాత కూతేస్తుంటే

ఎక్కడ లేని ఊపుతో ఊరౌతలి కుక్క 

బండి మండిగపు నీడపాటులో సేదతీర్తది.


పెద్దగట్టు యాపమానుగుట్ట

కొచ్చగట్టు దుప్పరాయిగుట్ట

తుమ్మసానికుంట 

ఏ గుట్టనడిగిన ఏ కుంటనడిగిన

పసులుగాసి నెత్తిమీద సద్దిబెట్టుకొని నడిసిన

బత్కును ఏ రాయినడిగిన 

రాతిగుట్టలన్నీ చరిత్ర చిహ్నాలైతాయి.


కట్టుకపోయిన సద్ది

తుమ్మకొమ్మకు తగిలిస్తే

పడమటి గాలికి ఊగూగి

కూరబువ్వ సింతొక్కంత కలిసిపోయినా

కడుపుల ఆకలి కరాళనృత్యం చేసినా

కంటనీరు ఎరుగకుండా

కమ్మటినీళ్ళు తాగి కష్టజీవిగా మారిపోతాడు.


ఆకలాపుకోలేక సద్దిముడిని ఇప్పుకోని

ఎంగిలిచేసి సగం తినేసిన

తినేటప్పుడు కుక్కకొక రొట్టెముర్క ఇసిరేసి

జీవితాన్ని ఎలా బత్కలో

ఈ ప్రపంచానికి గుణపాఠమై

పంటసేన్లో అసలైన 

సెమట పద్యమై నిలిచిపోతాడు మా నాయిన.

అవనిశ్రీ

99854 19424


Updated Date - 2022-04-04T06:46:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising