ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రావిశాస్త్రి సాహిత్యంలో రాజ్యం, రాజ్యాంగం’

ABN, First Publish Date - 2022-08-20T05:47:27+05:30

‘నేను రావిశాస్త్రి ఏకలవ్య శిష్యుడిని. న్యాయవ్యవస్థ క్షుణ్ణంగా అర్థం కావాలంటే ఆయన రాసిన ఆరుసారా కథలు చదివితే సరిపోతుంది’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘నేను రావిశాస్త్రి ఏకలవ్య శిష్యుడిని. న్యాయవ్యవస్థ క్షుణ్ణంగా అర్థం కావాలంటే ఆయన రాసిన ఆరుసారా కథలు చదివితే సరిపోతుంది’ అని రావిశాస్త్రి శతజయంతి సభల సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఇటీవల కొనియాడారు. చట్టాలు, సాక్ష్యాధారాలే కాదు, సామాజిక వాస్తవికతను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు న్యాయం చేయాలంటే, రావిశాస్త్రి సాహిత్యం లాంటివి కూడా లా పుస్తకాలతో పాటు చదవాలన్నారు ప్రధాన న్యాయమూర్తి. ఎవరా రావిశాస్త్రి, ఏమా రచనల గొప్పతనం అని నేటి తరం యువత, న్యాయవాదులు అడగవచ్చు. అందుకోసమే, రావిశాస్త్రి రచనలు, ఈనాటికీ కనిపించే ఆయన సృష్టించిన పాత్రలు, అందరినీ కదిలించే కోర్టు సన్నివేశాలను గుర్తించి, చర్చించేందుకే ఈ సభ. న్యాయం కోరవచ్చే ప్రజలపట్ల సమాజంలో ఆర్తిని, న్యాయవాద లోకంలో తగిన న్యాయస్ఫూర్తిని పంచేందుకు, ప్రేరణ కలిగించేందుకు ఉద్దేశించిన ఈ బహిరంగ సభ ఆగస్టు 21 ఆదివారం, హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10.30 నుండి జరుగుతుంది. జస్టిస్ జి. రాధారాణి, ఎన్. వేణుగోపాల్, ప్రొ. లక్ష్మణ్ గడ్డం, ఎ. రఘుకుమార్, కూర్మనాథ్, ఎం. వెంకన్న (ఐఎపిఎల్) తదితరులు పాల్గొంటారు. డి. సురేష్ కుమార్ (ఐఎపిఎల్) సభాధ్యక్షత వహిస్తారు.


– భారత ప్రజాన్యాయవాదుల సంఘం (ఐఎపిఎల్)

Updated Date - 2022-08-20T05:47:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising