ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధర్మం

ABN, First Publish Date - 2022-08-31T07:54:19+05:30

పిశాచాలు తినేసిన మానాన్ని జెండాగా చేసుకొని అస్థిపంజర జైల్లో చిమ్మ చీకటి ఏకాంత సెల్‌లో శిథిల కాలాన్ని, క్షత క్షణాలను లెక్కపెడుతున్న ఆమెను భయపెట్టే కొత్త చీకటి ఏమైనా ఉంటుందా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిశాచాలు తినేసిన మానాన్ని జెండాగా చేసుకొని అస్థిపంజర జైల్లో చిమ్మ చీకటి ఏకాంత సెల్‌లో శిథిల కాలాన్ని, క్షత క్షణాలను లెక్కపెడుతున్న ఆమెను భయపెట్టే కొత్త చీకటి ఏమైనా ఉంటుందా? అప్పుడు అభయమివ్వని కవచాలు ఇప్పుడు ఇంకేమిస్తాయి, ఖైదు తనకే గాని వారికెందుకవుతుంది? భారీ ప్రహరీగోడల నడుమ హరీ అంటున్న దాని పేరే బహుళం, వివిధం, వేల వేవేల రంగుల కలనేతల భారతం, కారాగారం వారి పెదాల మీది మెరుపు నవ్వు అవుతుంటే ఊచలు వారి చుట్టూ దేవనాట్యం చేస్తున్నాయి, వారు తమ కాషాయ మీసాల ఆరిపోయిన సంపెంగ నూనెను మళ్ళీ తనివారా పూసుకొంటారు, బూజుపట్టిన బూటు కాళ్లకు అణచివేత పాలిష్‌ను నవనవలాడేలా పట్టిస్తారు, వలువలెత్తుకుపోయినవాడి మాదిరిగా చట్టబద్ధ రేప్‌లు మర్డర్‌లే చేస్తారు, రాజధర్మం వారివైపే ఉంది, రాజ్యాంగ వృక్షం కింద రాలిన పళ్ళు ఏరుకొంటున్న జనం దాని చరమ గీతాలాపనలో గొంతులు బొంగురుపోయి, కళ్ళు లోతుకుపోయి కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరుతున్నారు, కమిషన్ ఒప్పందాలైనా, రెమిషన్ నియమాలైనా ఏలినవారి చేతిలోని తాళాలే, న్యాయపీఠాల దొంగ ముద్దులు వారిని పరవశులను చేస్తున్నాయి, కీచకుడు చేయలేని పనిని ఇంద్రుడు చేయగలిగాడు, మారువేషంలోనే మానహరణం చేయాలని వాడు చెప్పిన నీతి అక్షరాలా అమలవుతోంది, పిచ్చి తల్లీ! తిరగబెట్టిన నీ గాయానికి మందు లేదు, విలువల దవాఖానాలన్నీ మూతబడ్డాయి, ‘ఉపా’వాసాల్లో మగ్గుతున్నవారి చివరి శ్వాస కోసం అనిగాచుకొన్న నక్కల అరుపులు వినబడడం లేదా? హక్కు మానవతను బంధించిన ఉక్కు తాళమే ఇక్కడ, ధగధగ లాడే తిమిరమే.

నిజం

Updated Date - 2022-08-31T07:54:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising