ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాత్రుళ్ళు

ABN, First Publish Date - 2022-04-04T06:52:07+05:30

పగలు నుంచి పారిపోయి రాత్రి ఒడ్డుకు చేరుత రోజులో... నేను రాత్రికి చెందినవాడిని రాత్రి నా విడిదివెన్నెలకయిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పగలు నుంచి పారిపోయి

రాత్రి ఒడ్డుకు చేరుత

రోజులో...

నేను రాత్రికి చెందినవాడిని

రాత్రి నా విడిది


వెన్నెలకయిన చీకటికైన

రాత్రి అంటేనె సంబరం

పగలు కొలతల మీద ఉంటుంది

పగలు సచ్చిపోతూ

రాత్రి బతుకుతుంటా

పగలుకు ఒంటర్ని

రాత్రికి ఏకాంతాన్ని

రాత్రి వొడవకపోతే బాగుండు


ఋతువుల్ని వెంటేసుకొని

పంటపొలాల్లో తోటల్లో

కుంటల్లో చెరువుల్లో

తీరొక్క పనుల్లో

దుఃఖాన్ని వర్షిస్తూంటా

రాత్రి పగలుకు మధ్య

మెలికలు తిరిగిన కాలం


ఎన్ని పగటి గాయాలకు

వెన్నెల్ని గాజుగుడ్డని జేసి

కట్టిందో రాత్రి

రాత్రి నాకు మరో లోకం


పడమటి పుట్ట దాటినంగ

వెలుగుల్లో ఉసిల్ల గోల

ఇగం ఉయ్యాల్లో రాత్రి

జ్ఞాపకాల్ని రాజేసుకుంటుంటే

పరవశంలో ఒడ్డును 

ముద్దాడిన తెడలు


పిట్టలు కొమ్మలమీదినుంచి లేసి  

మినుగురుల కాంతిలో

గూళ్లల్లకు చేరుతూంటాయి

చిన్నపిట్టల కిచకిచలకు

చెట్లు పొదలు తలలూపుతుంటాయి

నీరు ఏరుల గుసగుసే గానమైంది


అందరు ఎల్లిపోయినంగ

తాళ్ళు రమ్మంటాయి

పూల చెట్లు పిలుస్తాయి

ఏవో నీడల సైగలు

రాత్రి అనంత రతి

నిశ్శబ్దం మాట్లాడుతుంది

దివ్య క్రీడల మైదానమిది


చీకటి ఎదకోరిన పువ్వుగ మారింది

నీటితుంపరలు రాలిపడే ఆకులు

నాకు వరుసయ్యినయి

అలుగులో చందమామలు

ఎగురుతుంటే

కల్లల్లోంచి నిద్రకాంత లేచి చూస్తుంది

వింతగొలిపే రాత్రుల్లో

కలల ముడుపులు కట్టుకుంటా

రాత్రి ఓ ఆదిమతాండవం


గీ రాత్రుల్ల కోసమే

అనేక పొద్దుల్ని మోసిన

నెత్తి మీదికెల్లి

భుజాల మీదుగ

పొద్దు దిగుతుండేది


గుర్తుండిపోయె

గీ రాత్రుల్లు తప్ప

నేనేమి ఎనకేసుకోలేదు

మునాసు వెంకట్‌

99481 58163 


Updated Date - 2022-04-04T06:52:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising