ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరణం లేని అక్షరం

ABN, First Publish Date - 2022-01-29T09:05:49+05:30

ఎండ్లూరి సుధాకర్ ఇక లేడు ముక్కుపచ్చలారని వయస్సులో నా ఎద ముట్టిన యువకవి సత్తముడు ఇక కన రాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎండ్లూరి సుధాకర్ ఇక లేడు

ముక్కుపచ్చలారని వయస్సులో

నా ఎద ముట్టిన

యువకవి సత్తముడు 

ఇక కన రాడు.


గురువు ముందు

శిష్యుడు వెళ్లిపోతే

ఆ గురువు మోసే బరువు

తండ్రి కన్న తక్కువదేమీ కాదు.


అనుకోలేదు

అప్పుడే వెళ్లిపోతాడని.

రెండో కూతురి పెళ్లితో

బాధ్యత తీరిందనుకున్నాడో!

నిజానికి

అర్ధాంగి హేమ పోయినప్పుడే

అర్ధాంగంతో మిగిలాడు

రత్నాల్లాంటి కూతుళ్ల కోసం

కాంతిని నిలదొక్కుకున్నాడు

కుటుంబాన్ని

సృజనకారుల బృందంగా

మలుచుకున్నాడు

కాలు తీసేసినందుకు

చిన్నబుచ్చుకున్నాడేమో!

ఇవాళ ఆగిన గుండెను

మడత పెట్టుకొని

నిశ్శబ్దంగా నిష్క్రమించాడు.

అటు ఓరియంటల్ పాండిత్యం

ఇటు దళ దళ పరీత

దళిత వేదనా పరత్వం

అతని ప్రత్యేకత.


‘‘కొత్త గబ్బిలం’’ రచనతో

జాషువా మళ్లీ 

పుట్టాడనుకున్నాం

ద్వేషం లేని నిరసన 

అతని తత్వం

గోదావరి జలంలో

‘‘ఇరానీ చాయ్’’ను కలిపిన

మణి ప్రవాళ వ్యక్తిత్వం.


ఎండ్లూరీ! నీళ్లూరిన 

నా కండ్లను

నువ్విప్పుడు చూడలేవు

నా గురించి

ఎలిజీ రాయవలసి వస్తుందని

ముందే వెళ్లిపోయావా 

నాయనా!

వెరీ బ్యాడ్.

డా. ఎన్. గోపి

Updated Date - 2022-01-29T09:05:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising