ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రంథాలయాలకు సామాజిక బాధ్యత ఉంది

ABN, First Publish Date - 2022-06-24T06:57:08+05:30

‘గ్రంథాలయాలు పోటీ పరీక్షల కోసమేనా?’ అంటూ జూన్ 9వ తేదీ ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో రవి కుమార్ రాసిన వ్యాసంలో రెండో కోణంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘గ్రంథాలయాలు పోటీ పరీక్షల కోసమేనా?’ అంటూ జూన్ 9వ తేదీ ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో రవి కుమార్ రాసిన వ్యాసంలో రెండో కోణంగా– మిగతా వారికి అవకాశం లేకుండా పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే యువతతో గ్రంథాలయాలు నిండిపోయాయని– వెలిబుచ్చిన అభిప్రాయం సరైనది కాదు.


ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల ద్వారానే గ్రంథాలయాల నిర్వహణ జరుగుతున్నదనేది జగద్విదితమే. పన్నులు కడుతున్న వారి జాబితాలో నేటి ఉద్యోగార్థుల కుటుంబాల వారు కూడా ఉన్న సంగతిని విస్మరించకూడదు. మరి అలాంటపుడు గృహిణులు, వయోవృద్ధులు, పరిశోధకులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కవులు, కళాకారులు, రచయితలతో పాటు నిరుద్యోగులు కూడా ఈ గ్రంథాలయాలను ఎంచుకోవటానికి అర్హులే కదా? ఈ విషయాన్ని సానుభూతితో కాకుండా, సమాజపరమైన బాధ్యతగా సానుకూలమైన అవకాశం వారికి ఇప్పుడు లభించినట్లు భావించాలే తప్ప, ఉద్యోగార్థులు పోటీ పరీక్షల కోసం గ్రంథాలయాలను ఎంచుకోవడం వల్ల మిగతా చదువరులు తమ అవకాశాలను కోల్పోతున్నారని ఆక్షేపించడం సమంజసం కాదు.


కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో గ్రంథాలయాలన్నీ నిరవధికంగా మూతబడినపుడు పైన పేర్కొన్న వారందరూ విద్యార్థుల మాదిరిగానే ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్ మార్గాలనే అనుసరించారు. కరోనా ఉధృతి తగ్గి గ్రంథాలయాలు తెరుచుకున్న తర్వాత సందర్శకుల సంఖ్య పూర్వస్థితికి చేరుకోలేదన్న విషయం గమనార్హం. ఇక సామాజిక మీడియా ప్రభావం వల్ల కూడా గ్రంథాలయాల ప్రాభవం క్రమక్రమంగా మరుగున పడిపోయే స్థితిలో ప్రభుత్వోద్యోగ ప్రకటనలతో రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా అనేక కోచింగ్ సెంటర్లు పుట్టుకొచ్చాయి. వేలల్లో ఫీజులు చెల్లించుకోలేని నిరుద్యోగ యువకులు పోటీ పరీక్షలకు పఠన కేంద్రాలుగా గ్రంథాలయాలను ఎంచుకున్నారన్నది వాస్తవం. దీనికి తోడు ప్రభుత్వం కూడా నిరుపేద యువత పోటీపరీక్షలకు సన్నద్ధం కావడానికి గ్రంథాలయాల్లో కనీస వసతులు కల్పన, సంబంధిత పుస్తకాలను సమకూర్చేందుకు దృష్టి సారించడం హర్షించదగినదే. స్థానిక నాయకులు ప్రస్తుతానికి తమ వంతుగా ఏదోవిధంగా సహకరించగలగటం, ఒకరకంగా నిరుద్యోగులకు చేయూతనందించే ప్రక్రియగానే భావించాలి తప్ప, మిగతావారు గ్రంథాలయాలకు వెళ్లలేని పరిస్థితులు కల్పించారని వాపోవడం సరైనది కాదు. ఇప్పుడున్న వాతావరణం ఆరునెలలో, సంవత్సరమో ఉంటుందేమో. తరువాత మిగతా వారందరూ గ్రంథాలయాలను ఉపయోగించుకోవడం సంతోషించదగిన పరిణామమే.

పాలడుగు రత్నాకర్ రావు

Updated Date - 2022-06-24T06:57:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising