ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రూరంగ స్థలం

ABN, First Publish Date - 2022-01-17T05:56:38+05:30

రోజూ కొన్ని లోటాలు పోసి నీటి మొక్కను పెంచాను అది పెరిగి తన చుట్టూ పొలాలను ఫలాలను కంటుందని ఆశించాను, కాని నా కన్నుల్లో చేరి అక్షయ వాహిని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోజూ కొన్ని లోటాలు పోసి నీటి మొక్కను పెంచాను అది పెరిగి తన చుట్టూ పొలాలను ఫలాలను కంటుందని ఆశించాను, కాని నా కన్నుల్లో చేరి అక్షయ వాహిని అవుతుందనుకోలేదు, నీటి నీడలో చెమట సిరులను పోసి వాటిని బోలెడింతలు చేసి పిల్లాది కుటుంబాలను కళకళలాడిస్తుందనుకొన్న రైతును ఉరికి తరుమతుందని యెప్పుడూ కల కనలేదు, హరిత సింహాసనం మీద కూచొని పాలించే జలపతి దళారుల దండమై ఆకలి శత్రువులకు మరణ శాసనాలు లిఖిస్తుందనుకోనే లేదు, రూపాయిని నాటి, వయసు వృక్షమయ్యేదాకా చూస్తూనే వచ్చాను అది విరగ్గాస్తుందని, హుండీలో వేసిన నాణెం అదృష్ట బంగారు గని కాగలదని నిరీక్షించినట్టు.. బాల్యంలో నేను మనసారా మలిచిన కాగితప్పడవలేవీ నన్ను కష్టాల కడలి దరి చేర్చలేదు. ఊహ వుల్లి పొరల మల్లె, జాజి నదుల్లో మునిగి వచ్చిన సువాసనల సమీర సముద్రమైతే, వాస్తవం కరుగుతున్న 

ఇనుప కాలువలో యీత, పోరాట తీరానికి చేర్చే కరకు నిజాల పడవ, దారిలో ఆయుధాలందించే చేతులుంటే చాలు, ఈ విషయం తెలుసుకోడానికి చాలామందికి వొక జీవితం కూడా సరిపోదు, నిప్పును గప్పున నోట్లో వేసుకోగల పసితనం పెద్దయి ఇతరుల జీవన క్షేత్రాల్లో అగ్గి విత్తనాలు నాటగలదు, బతుకు మొలకకు ఏ ఎరువు వేస్తే ఆ పంటే పండుతుంది, ఇక్కడ తల్ల కిందుల జనాలు తప్పెట్లు తాళాలు మోగిస్తూ స్వీయ విషాద వినోదాన్ని పంచిపెడుతుంటారు, వారిని మత్తుల గమ్మత్తుల పునర్జన్మల కొరడాలతో కొట్టి ముందుకు నడిపించే పశుల కాపరులకు కొరత ఉండదు, మేటి చిత్రకారులు గీసిన మేదినీ వలయాల నిండా మేడలను మోసే ఎముకల గూళ్ల లోని అర్ధ నగ్న అశ్రు శరీరాల అనునిత్య చిందులే, జూబ్లీ కొండల కింది వెంకటగిరిలూ, కృష్ణానగర్‌ లే, ప్రాసాదాల కోసం కొట్టిన కొండల పిండితో చేసే చాలీ చాలని రొట్టెలే, ఆదివారపు సంత కోసం రూపెత్తిన అర కొర రూకల తనువులే, నిర్మాణం పూర్తికాక పాడుబడిన మొండి గోడల శిథిలాల, వెలిసిన రంగుల చీరల హ్రస్వ ఆశల క్రూరంగ స్థలాలే.

నిజం


Updated Date - 2022-01-17T05:56:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising