ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భజన మాని.. ఉద్యమించండి!

ABN, First Publish Date - 2022-12-31T01:14:48+05:30

తెలంగాణ రాష్ట్రంలో ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఉద్యోగులు తమ హక్కుల పరిరక్షణ, సమస్యల సాధన కోసం ఏర్పాటు చేసుకున్న సంఘాలనే కంచెలు ఉద్యోగుల సంక్షేమాన్ని మరిచి పాలకులకు తొత్తులుగా, భజనపరులుగా మారిపోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ రాష్ట్రంలో ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఉద్యోగులు తమ హక్కుల పరిరక్షణ, సమస్యల సాధన కోసం ఏర్పాటు చేసుకున్న సంఘాలనే కంచెలు ఉద్యోగుల సంక్షేమాన్ని మరిచి పాలకులకు తొత్తులుగా, భజనపరులుగా మారిపోయాయి. గతంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరసనలు, ధర్నాలు, సమ్మెలు చేసి పాలక ప్రభుత్వాలను ఒప్పించి సమస్యలు సాధించుకోవడం జరిగేది. కాని ఇప్పుడు– మీ ఉద్యోగులందరు మాకు మద్దతు ఇచ్చి పాలక పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు.

ముఖ్యంగా నెలంతా పనిచేసిన తరువాత ఒకటో తేదీన వేతనం పొందడం ఉద్యోగి హక్కు. కాని గత రెండు సంవత్సరాలుగా విడతల వారిగా, కొన్ని జిల్లాలకు 20వ తారీఖు వరకు జీతాలు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నందునే ఉద్యోగులకు జీతాల చెల్లింపు ఆలస్యం అవుతున్నదన్న అర్థిక మంత్రి మాటలు విడ్డూరంగా ఉన్నాయి. ఉద్యోగులు పొందాల్సిన జిపిఎఫ్‌ అప్పులు, సరెండర్‌ సెలవులు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, పెన్షనర్ల కమ్యుటేషన్‌, గ్రాట్యుటీ మొత్తాలు ఆరు నెలలుగా చెల్లింపులు జరగడం లేదు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఐక్య ఉద్యమాలు చేసి ఎన్నో డిమాండ్లను సాధించుకొన్న సందర్భాలు కోకొల్లలు. 2004 సంవత్సరం ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు ఆరు విడుతల డి.ఎ బకాయి పడి, ఎన్నికల ముందు విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సందర్భంలో ఉద్యోగుల పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న, ఎపిఎన్‌జిఓ, టిఎన్‌జిఓ, ఇతర సంఘాలు అన్నీ జెఎసిగా ఏర్పడి 2010లో ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఉపాధ్యాయులకు, పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని జూన్‌ 9, 2015న ఇందిరాపార్కులో వేలాది మంది ఉపాధ్యాయులతో ధర్నా చేపట్టి సాధించుకున్న విషయాన్ని గుర్తు చేసుకోండి.

నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్‌కి సంఘాల మద్దతు తప్ప, ఉద్యోగుల, పెన్షనర్ల మద్దతు లేదనే విషయాన్ని సంఘాల నాయకులు గుర్తించాలి. దీనికి ఉదహరణగా డిసెంబర్‌ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగులు వినియోగించుకున్న పోస్టల్‌ బ్యాలెట్లలో 119 నియోజకవర్గాలలో 80 చోట్ల ప్రతిపక్ష అభ్యర్థులకే మెజార్టీ ఉద్యోగులు ఓటు వేసిన విషయాన్ని గుర్తు చేసుకోండి. కేసీఆర్‌ది కపట ప్రేమ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సంఘాలకు గుర్తింపే లేదు. గుర్తింపు సంఘాలను ఎంపిక చేయడానికి 2014లో వేసిన అధికారుల కమిటీ ఏమైందో తెలవదు. గత పట్టభద్రుల ఎన్నికల్లో లబ్ది చేకూర్చారని ఒక సంఘానికే ఆన్‌డ్యూటి ఇచ్చి, మిగతా సంఘాలను పట్టించుకోని కేసీఆర్‌, మునుగోడు ఎన్నికల్లో లెఫ్ట్‌ పార్టీలు మద్దతు ఇస్తే ఎన్నికల కోడ్‌ను ప్రక్కనబెట్టి లెఫ్ట్‌ సంఘాలతో పాటు 11 సంఘాలకు ఆన్‌డ్యూటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సాధారణ ఎన్నికలకు ముందు 2018 ఫిబ్రవరిలో టిఎన్‌జిఓ ఉద్యోగుల సమస్యల సాధనకై ఉప్పల్‌లో నిర్వహించిన బహిరంగ సభ, అదే సంవత్సరం మార్చిలో రాష్ట్రంలోని 53 ఉపాధ్యాయ సంఘాలు జెసిటియుగా ఏర్పడి ఎస్‌ఎస్‌సి స్పాట్‌ బహిష్కరణ పిలుపు ఇవ్వడం వల్ల మే 18న కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉద్యోగ సంఘాలతో సమావేశమై సమస్యలను చర్చించారు.

ఉమ్మడి రాష్ట్రంలో లేనటువంటి కొత్త కొత్త సమస్యలను ఈనాడు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు టిఆర్‌ఎస్‌, బిఆర్‌ఎస్‌గా మారితే ఢిల్లీకి వెళ్ళి పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందించారు తప్ప, సమస్యల పరిష్కారం కోరలేదు. కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వం నుండి తమ సమీప బంధువులకు ఉద్యోగ విరమణ అనంతరం సర్వీసు పొడిగింపు, ఇతరత్రా ప్రోత్సాహకాలు పొందడం వల్లనే ప్రభుత్వాన్ని సమస్యలు పరిష్కరించమని అడగడానికి జంకుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. డిసెంబర్‌ 2023లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగడానికి ముందే, లేదా ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెడుతుందనే వార్తలు వస్తున్న సందర్భంలో తక్షణమే పిఆర్‌సీ కమిటీని నియమించుకొని ఎన్నికలకు ముందే పిఆర్‌సీ అమలు చేయించుకోవాలి. ఉద్యోగుల ప్రధాన సమస్య అయిన సిపిఎస్‌ రద్దును ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టించుకోవాలి. సిపిఎస్‌ రద్దు చేయించుకున్న రాజస్థాన్‌, ఛత్తీస్‌గడ్‌, పంజాబ్‌, హిమచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల ఉద్యోగ సంఘాల వలె, కర్ణాటక, మహారాష్ట్రలోని ఉద్యోగ సంఘాల ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకొని మన రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ ఐక్య కార్యాచరణ రూపొందించాలి. సిపిఎస్‌ రద్దు, నూతన పిఆర్‌సీ, సాధారణ బదిలీలు, భార్యాభర్తల అంతర్‌ జిల్లా బదిలీలు, వేతనాలు సకాలంలో చెల్లింపు లాంటి సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి.

పులి సరోత్తంరెడ్డి

మాజీ అధ్యక్షులు, పి.ఆర్‌.టి.యు–టిఎస్‌

Updated Date - 2022-12-31T01:14:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising