ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యాచారాలు ఆగాలంటే...

ABN, First Publish Date - 2022-06-21T06:21:54+05:30

ముక్కుపచ్చలారని బాలికల నుంచి మహిళల వరకు ఎక్కడో ఒకచోట నిరంతరం అత్యాచారాలు జరుగుతున్నాయి. సెల్‌ఫోన్‌లలో అశ్లీల వీడియోలు, శృంగార సన్నివేశాలు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముక్కుపచ్చలారని బాలికల నుంచి మహిళల వరకు ఎక్కడో ఒకచోట నిరంతరం అత్యాచారాలు జరుగుతున్నాయి. సెల్‌ఫోన్‌లలో అశ్లీల వీడియోలు, శృంగార సన్నివేశాలు, సినిమాలలో, టీవీ సీరియళ్లలో మద్యం తాగడం, హత్యలు, అత్యాచారాల దృశ్యాలను చూసి ఉద్రేకం, ఉద్వేగంతో యువత ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నది. తల్లిదండ్రుల నియంత్రణ లేని, పనీ పాటాలేని యువత నియంత్రణ కోల్పోయి పెడదారి పడుతున్నది. నేటి ప్రభుత్వాలు కూడా మద్యం దుకాణాలకు విచ్చలవిడిగా అనుమతులివ్వడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నైరాశ్యంతో ఉన్నవారు మద్యానికి, మత్తుపదార్థాలకు లోనై ఆ మత్తులో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీని నివారణకు ప్రతి గ్రామం, పట్టణంలో పఠనాలయాలు, గ్రంథాలయాలు, వ్యాయామశాలలు ఏర్పాటు చేయాలి. యువతను ఎక్కువగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. ప్రపంచంలో ప్రతి దేశం ఆ దేశ సంస్కృతికి అనుగుణంగా పాఠ్యాంశాలు రూపొందిస్తున్నది. అలాగే మన దేశంలో కూడా సత్యం, న్యాయం, శీలం, ధర్మం వంటి మూలాధారాలతో పాఠశాల, కళాశాల స్థాయిల్లో పాఠ్యాంశాలు రూపొందించి బోధించాలి. టీవీసీరియల్స్‌, సినిమాలలో హత్యలు, అత్యాచారాలు, మద్యం తాగడం, అశ్లీల శృంగార దృశ్యాలను సెన్సార్‌ బోర్డువారు కఠినంగా నిషేధించాలి.

పెండెం శివానంద్‌


Updated Date - 2022-06-21T06:21:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising