ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవుని మనుగడకై మానవ హక్కులు

ABN, First Publish Date - 2022-12-10T01:17:39+05:30

ఐక్యరాజ్యసమితి 1948 డిసెంబరు 10న విశ్వ మానవ హక్కుల ప్రకటన (యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్)ను ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐక్యరాజ్యసమితి 1948 డిసెంబరు 10న విశ్వ మానవ హక్కుల ప్రకటన (యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్)ను ప్రకటించింది. అన్ని చట్టపరమైన అంశాల్లో, సాంస్కృతిక వ్యవహారాల్లో వేర్వేరు నేపథ్యాలున్న ప్రపంచ దేశాల ప్రతినిధులు అందరూ కలసి రెండు సంవత్సరాలు కృషి చేసి ఈ మానవ హక్కుల ప్రకటనను రూపొందించారు. జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ ఏ విధమైన వివక్షకు గురికాకుండా ఉండే హక్కు; చిత్రహింసలు, క్రూరత్వం, వెట్టిచాకిరీ, బానిసత్వం, గృహ హింస, మానవ అక్రమ రవాణా నుండి రక్షణ పొందే హక్కు; పూర్తి ఆధారాలు లేకుండా ఏ వ్యక్తినీ నిర్బంధించకుండా ఉండే హక్కు; స్వేచ్ఛగా స్వదేశంలో లేదా విదేశాల్లో పర్యటించే హక్కు మొదలైన వాటిని మానవ హక్కులుగా ఐరాస ప్రకటించింది. ప్రతి ఒక్కరూ ఎలాంటి వివక్ష లేకుండా ఈ హక్కులను పొందవచ్చు. మానవ హక్కుల పరిరక్షణ కోసం 1993లో భారత ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం కింద 1993 అక్టోబరు 12న జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పడింది. ఈ కమిషన్ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఫిర్యాదు మేరకు విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మానవ హక్కుల సమస్యలను వెంటనే పరిష్కరించడానికి కోర్టులతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి మానవ హక్కుల కమిషన్ లు పని చేస్తున్నాయి. మనిషిని మనిషిగా గౌరవించినప్పుడే మానవ హక్కులు విజయవంతం అవుతాయి.

–మిద్దె సురేష్

(నేడు అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం)

Updated Date - 2022-12-10T01:17:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising