ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతికి ఉద్యోగులు మద్దతివ్వాలి

ABN, First Publish Date - 2022-01-07T06:17:09+05:30

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారి నెల నెలా ఉద్యోగుల జీతాలకే అప్పు చేయవలసిన దుస్థితి నెలకొంది. వారి జీతాలు పెంచడం అసాధ్యంగా కనబడుతున్న నేపథ్యంలో మూడు రాజధానులు సాధ్యమా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారి నెల నెలా ఉద్యోగుల జీతాలకే అప్పు చేయవలసిన దుస్థితి నెలకొంది. వారి జీతాలు పెంచడం అసాధ్యంగా కనబడుతున్న నేపథ్యంలో మూడు రాజధానులు సాధ్యమా? ఒకవేళ కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలించే పక్షంలో ఉద్యోగులకు మరిన్ని కష్టాలు తప్పవు. మూడు రాజధానుల ప్రతిపాదన ప్రజలపై మోయలేని భారమే కాకుండా పాలనాపరంగా అనేక ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగుల విధి నిర్వహణ సంక్లిష్టం అవుతుంది. హైకోర్టు కర్నూలులో ఉంటే, ఉద్యోగులు తరుచూ కోర్టు పనులపై విశాఖ నుంచి కర్నూలు వెళ్ళటానికి ఎన్నో వ్యయ ప్రయాసలనెదుర్కోవాలి. ఆచరణలో ఇలాంటి సమస్యలు కోకొల్లలు. కాబట్టి ప్రభుత్వోద్యోగులు అమరావతే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ముక్తకంఠంతో కోరాలి.

గరిమెళ్ళ రామకృష్ణ, ఏలూరు

Updated Date - 2022-01-07T06:17:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising