ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత శక్తిమాన్‌ కలాం

ABN, First Publish Date - 2022-10-15T05:57:57+05:30

బహుముఖ ప్రజ్ఞాశీలి, రచయిత, ఉపాధ్యాయుడు, మిసైల్ మ్యాన్, గొప్ప శాస్త్రవేత్త, భారతదేశపు 11వ రాష్ట్రపతిగా సేవలు అందించిన మహానుభావుడు మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బహుముఖ ప్రజ్ఞాశీలి, రచయిత, ఉపాధ్యాయుడు, మిసైల్ మ్యాన్, గొప్ప శాస్త్రవేత్త, భారతదేశపు 11వ రాష్ట్రపతిగా సేవలు అందించిన మహానుభావుడు మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం.


పిల్లలకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా కలాం పేరు తెచ్చుకున్నారు. ప్రసంగాలతో, సూక్తులతో చిన్నారుల్లో ఎంతో స్ఫూర్తి నింపారు. కలలు కనండి.. నిజం చేసుకోండి అంటూ పిల్లలకు, యువతకు ఇచ్చిన సందేశం ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్‌గా ప్రజాదరణ పొందుతుంది. పిల్లలకు సైన్స్ ఎగ్జిబిషన్లు, స్పోర్ట్స్‌ డే సందర్భంగా స్కూల్స్‌కి వెళ్లి మరీ పిల్లల్ని ప్రోత్సహించేవారు. ఆయన ఈమెయిల్ ఐడీని పిల్లలకు ఇచ్చి ఎవరైనా తనకు మెయిల్ చేస్తే రిప్లై ఇచ్చేవారు. ఏపీజే అబ్దుల్ కలాంకు పిల్లల మీద ఉన్న ప్రేమను, ఆ ప్రోత్సాహన్ని గుర్తించి ప్రపంచ దేశాలు కలాం పుట్టిన రోజు అక్టోబర్ 15ను ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకుంటున్నాయి.


కలాం ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచి, స్నానం చేసి లెక్కల ట్యూషన్‌కి వెళ్లేవాడు. ట్యూషన్ పూర్తి అయ్యాక తండ్రితో కలిసి నమాజ్‌కు వెళ్లేవాడు. ఆ తరువాత రైల్వేస్టేషన్‌కి వెళ్లి మద్రాసు నుంచి వచ్చే దినపత్రికల పార్సిల్‌ని తీసుకొని వాటిని ప్రజలకు అమ్మేవారు. ఈ విధంగా పనిచేస్తూనే చదువుకున్నాడు. కలాంది ఉమ్మడి కుటుంబం. అందరిలో కలాం చిన్నవాడు, చదువుకుంటూ పని చేయడంతో వారి అమ్మ కలాం పైన చాలా శ్రద్ధ చూపేది. తనకు ముగ్గురు అమ్మలు అంటే చాలా ఇష్టమని కలాం ఎన్నోసార్లు చెప్పారు. ఆ ముగ్గురు అమ్మలో మొదటివారు మాతృమూర్తి, రెండవవారు భారత సంగీతానికి అమ్మ– ఎంఎస్ సుబ్బులక్ష్మి. మూడవవారు మదర్ థెరిస్సా. 1950లో తిరుచ్చిలో తాను చదువుకుంటున్నప్పుడు విన్న ‘ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు’ అన్న పాట తనను పరవశంలో ముంచెత్తిందని.. అప్పటి నుంచి సబ్బులక్ష్మి సంగీతాన్ని ఎంతగానో అభిమానించానని అన్నారు. దేశం కాని దేశంలో పుట్టి, మన దేశానికి దశాబ్దాల పాటు అమూల్య సేవల్ని అందించిన మదర్ థెరిస్సా తాను అభిమానించే మూడో అమ్మ అని కలాం చెప్పారు.


భారత్ తయారు చేసిన పలు మిసైల్స్‌ వెనక ఉన్న మాస్టర్‌ మైండ్‌ అబ్దుల్ కలాందే. అగ్ని, పృథ్వి లాంటి క్షిపణులు తయారు చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వాటి అభివృద్ధి నుంచి ప్రయోగించేంత వరకూ అన్నింట్లోనూ ఆయన మేధాశక్తి ఉంది. అందుకే అబ్దుల్ కలాంను మిసైల్ మ్యాన్‌గా పిలుస్తారు. శక్తి ఉన్నవాళ్లెవరైనా సరే గౌరవాన్ని కోరుకుంటారని, భారత్ శక్తిమంతమైందని తప్పకుండా అందరూ గౌరవిస్తారని ఆయన అంటూ ఉండేవారు.


మిసైల్‌ మ్యాన్‌గా, భారత రాష్ట్రపతిగా అంతకు మించి ఓ గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా చరిత్రలో నిలిచిపోయారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన వెళ్లిపోయినా, ఆయన తాలూకు స్ఫూర్తి మాత్రం చిరకాలం నిలిచిపోతుంది. శాస్త్రవేత్తగా ఆయన మన దేశానికి అందించిన విజ్ఞానం అపారం. ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’ అని ఆయన ఇచ్చిన నినాదం ఇప్పటికీ ఎప్పటికీ విద్యార్థులు, యువతకు మంచి ప్రేరణ!


– పీలి క్రిష్ణ

(నేడు అబ్దుల్‌ కలాం జయంతి)

Updated Date - 2022-10-15T05:57:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising