ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వజ్రోత్సవ పుస్తక ప్రదర్శన

ABN, First Publish Date - 2022-08-16T06:09:39+05:30

హేమంతంలో పాఠకులను పలకరించే హైదరాబాద్‌ పుస్తకమహోత్సవం, ఈ ఏడు అక్షరి రుతువులోనూ కొలువుదీరనుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హేమంతంలో పాఠకులను పలకరించే హైదరాబాద్‌ పుస్తకమహోత్సవం, ఈ ఏడు అక్షరి రుతువులోనూ కొలువుదీరనుంది. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ త్యాగధనుల స్ఫూర్తి గాథలను, జాతీయోద్యమ చరిత్రను యువతరానికి పరిచయం చేయాలనే సంకల్పంతో తెలంగాణ సాహిత్య అకాడమీ ‘వజ్రోత్సవ పుస్తక ప్రదర్శన’ను నేటినుంచి 22వ తేదీ వరకు లాల్‌బహదూర్‌ (ఎల్బీ)స్టేడియం వేదికగా నిర్వహించనుంది. దర్శనవేళలు మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8గంటల వరకు. మహాత్మాగాంధీ జీవితం, బోధనలు, దృక్పథంపై వెలువడిన సుమారు 3,000 పుస్తకాలను, గాంధీ తాత్వికతను ప్రతిబింబించే కుటీర పరిశ్రమ ఉత్పత్తులను, బాపూజీ స్వాతంత్య్ర పోరాట ఘట్టాల ఛాయాచిత్రాలను ప్రదర్శనకు ఉంచుతారు. స్వాతంత్ర్యోద్యమానికి సంబంధించిన అరుదైన పుస్తకాలతో తెలుగు అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఎమెస్కో, ప్రజాశక్తి, నవచేతన, తెలంగాణ పబ్లికేషన్స్, మిలింద్‌ ప్రకాశన్ వంటి పలు ప్రచురణ సంస్థల పుస్తక స్టాళ్లు కొలువుదీరనున్నాయి. 


ముఖ్యమంత్రి కేసీఆర్ అభీష్టం మేరకు నిర్వహిస్తున్న ఈ వజ్రోత్సవ పుస్తక ప్రదర్శన ద్వారా మహాత్ముడి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం.

జూలూరి గౌరీశంకర్‌

అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ

Updated Date - 2022-08-16T06:09:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising