ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘టీకా’ నిర్బంధం కాదు

ABN, First Publish Date - 2022-01-08T06:25:40+05:30

కొవిడ్‌ టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలని ఆరోగ్య, మునిసిపల్‌, జిల్లా అధికారులు, కార్యకర్తలు మనకి చెప్తున్నారు. ఈ టీకాలు వేసుకోకపోతే మనకి రేషన్‌, పింఛన్‌, కరెంటు కట్‌ చేసేస్తారు, బహిరంగ.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలని ఆరోగ్య, మునిసిపల్‌, జిల్లా అధికారులు, కార్యకర్తలు మనకి చెప్తున్నారు. ఈ టీకాలు వేసుకోకపోతే మనకి రేషన్‌, పింఛన్‌, కరెంటు కట్‌ చేసేస్తారు, బహిరంగ ప్రదేశాల్లో ప్రవేశం ఉండదని అనేక మీడియా మాధ్యమాలలో చెప్తున్నారు. అయితే ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. టీకాలు వేసుకోవటం పూర్తిగా స్వచ్ఛందమే. కొవిడ్‌ టీకాలతో రేషన్‌కు, పెన్షన్‌కు ఉద్యోగాలకు ముడి పెట్టి ప్రజలకు బలవంతంగా టీకాలు వేయకూడదు, వేయించుకోమని వేధించకూడదు.


కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. (కొవిడ్‌–19 టీకాలు వేసుకోవడం స్వచ్ఛందమని) గర్భిణులు, పాలిచ్చే తల్లుల పైన కొవిడ్‌ టీకాల క్లినికల్‌ ట్రయల్స్‌ ఇప్పటివరకు జరుపలేదని, అందువల్ల వాళ్లు కొవిడ్‌ టీకాలు వేసుకోకూడదని అదే వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. అయినా అనేక చోట్ల డాక్టర్లు, ఆశావర్కర్లు గర్భిణులకు, పాలిచ్చేతల్లులకు కూడా టీకాలు వేసేస్తున్నారు. ఇది ప్రమాదకరం, చట్ట వ్యతిరేకరం, శిక్షార్హమైన నేరం. టీకాలు వేసుకున్న వారికి, టీకాలు వేసుకోని వారికి మధ్య ఎటువంటి వివక్ష చూపించకూడదని, సమాచార హక్కు కింద అడిగిన అనేక ప్రశ్నలకు ఇచ్చిన జవాబులలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.


సుప్రీంకోర్టు, హైకోర్టులలో ఇచ్చిన వాంగ్మూలాలలో కూడా టీకాలు వేసుకున్న వారికీ, టీకాలు వేసుకోని వారికి మధ్య ఎటువంటి వివక్ష చూపించకూడదని, టీకాలు తీసుకోవటం పూర్తిగా స్వచ్ఛందమేనని స్పష్టంగా తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రతి పౌరుడికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పించింది. ఆ జీవించే హక్కులో నచ్చిన మందులు ఎంపిక చేసుకునే హక్కు కూడా ఉందని సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులలో నిర్ణయించారు.


టీకాలను బలవంతంగా వేస్తే అది సుప్రీంకోర్టును ధిక్కరించటమే అవుతుంది. కామన్‌ కాజ్‌ vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (20౧8) కేసులో, తన శరీరంపై వ్యక్తికి ఉన్న హక్కు, ఏ వైద్య చికిత్స తీసుకోవాలో నిర్ణయించుకునే హక్కు గురించి ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇస్తూ– ఒక వయసు వచ్చిన సమర్థుడైన వ్యక్తికి ఎటువంటి చికిత్సనైనా తిరస్కరించే హక్కు లేదా ఇతర చికిత్సా పద్ధతులను ఎంపిక చేసుకునే హక్కు ఉందని స్పష్టంగా పేర్కొంది. ఒకవేళ అటువంటి నిర్ణయం వల్ల మరణించే ప్రమాదం ఉన్నా సరే వ్యక్తులు వైద్య చికిత్సను తిరస్కరించే హక్కుకి ఎటువంటి షరతులు వర్తించవని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘తన స్వంత నిర్ణయాలు తీసుకోగలిగే వ్యక్తిని, అతడు ఒక వైద్య చికిత్సను ఎందుకు వద్దంటున్నాడో కారణాలు చెప్పమని చట్టం కాని, రాజ్యాంగం కాని నిర్బంధించలేదు. అంతే కాదు ఆ తిరస్కృతిని ఎటువంటి బయటి పర్యవేక్షక వ్యవస్థ కూడా నియంత్రించలేదు. అందువల్ల పౌరుల ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా టీకాలు వేయడమనేది సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులను ధిక్కరించడమవుతుంది, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 21, 19ని ఉల్లంఘించడమవుతుంది.‍


– అవేకెన్‌ ఇండియా మూవ్‌మెంట్‌

Updated Date - 2022-01-08T06:25:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising