ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ డిప్యుటేషన్లలో ‘ఆశ్రమ’ ఉపాధ్యాయులు!

ABN, First Publish Date - 2022-06-23T06:51:43+05:30

తెలంగాణ ప్రభుత్వం ఎస్టీలకు ఉచిత విద్యా వసతి కల్పించేందుకు ఎస్టీ వెల్ఫేరు ఆశ్రమ పాఠశాలలను, హాస్టళ్లను ప్రతి ఏటా పెద్ద బడ్జెట్ కేటాయించి నిర్వహిస్తున్నది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ ప్రభుత్వం ఎస్టీలకు ఉచిత విద్యా వసతి కల్పించేందుకు ఎస్టీ వెల్ఫేరు ఆశ్రమ పాఠశాలలను, హాస్టళ్లను ప్రతి ఏటా పెద్ద బడ్జెట్ కేటాయించి నిర్వహిస్తున్నది. ఉచిత నిర్బంధ విద్య బాలల హక్కు చట్టం–2009లోని అధ్యాయం నాలుగులోని 27, 28 పేరాగ్రాఫుల ప్రకారం, అలాగే తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు ఇచ్చిన ఆదేశాల ప్రకారం– ఏ ఉపాధ్యాయుడినీ విద్యా బోధనతో నిమిత్తంలేని విధుల్లో నియమించకూడదు. ఇందుకు మినహాయింపులుగా జనాభా గణనను, ఎన్నికల విధులను, ఇంకా ప్రకృతి విపత్తుల ఉపశమన చర్యలను మాత్రమే చట్టంలో పేర్కొన్నారు. ఇంత స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ– తెలంగాణ జిల్లాల్లోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలల్లోని 28మంది ఉపాధ్యాయులు అక్రమంగా కమిషనర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేరు ఆఫీసు (డి.ఎస్.ఎస్. భవన్, మసాబ్ టాంక్, హైదరాబాదు)లో ఐదేళ్లుగా డిప్యుటేషన్ మీద పని చేస్తున్నారు. వీరి ఉద్యోగ విధి ఎస్టీ పాఠశాలల్లోని పిల్లల విద్యా బోధన చేయటం అయినప్పటికీ వీరు తమ విధులకు ఏ మాత్రం న్యాయం చేయటం లేదు. వీరికి ఎస్టీ ఆశ్రమ పాఠశాలల్లో పిల్లలకు చదువు చెప్పటంపై ఏ మాత్రం ఆసక్తి లేనప్పుడు వీరిని ఆ విధుల నుంచి తప్పించి ప్రత్యేక ఆర్డరు ద్వారా ఆ ట్రైబల్ వెల్ఫేరు ఆఫీసులోని ఉద్యోగాలకే తరలించవచ్చు కదా! కానీ ఇప్పటిదాకా అటువంటి క్రమశిక్షణ చర్య ఏదీ వీరిపై తీసుకోలేదు. ఈ విషయమై మేము మార్చి 1, 2022న అధికారులకు ఒక ఫిర్యాదు చేసినప్పటికీ వారి వద్దనుంచి ఏ స్పందనా లేదు. అయితే ఈ ఫిర్యాదు తర్వాత టీడబ్ల్యూడీ హెడ్ ఆఫ్ డిపార్టుమెంటు, అడిషనల్ డైరెక్టర్లు ఈ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు కొందరు టీచర్ల డిప్యుటేషన్ కాన్సిల్ చేసి, మరికొందరివి ఇంకా కొనసాగిస్తున్నారు. విద్యాబోధన మానివేసి చట్టవిరుద్ధంగా, ఇష్టారాజ్యంగా అక్రమ డిప్యుటేషన్లలో  పని చేస్తున్న టీచర్లపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి.

కత్రావత్ హన్మంత్ నాయక్

పాపకబండ, ఖమ్మం

Updated Date - 2022-06-23T06:51:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising