ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రగులుతున్న పంజరం

ABN, First Publish Date - 2022-08-08T05:49:01+05:30

చిటుకు చిటుకుమని ఒహటే చప్పుడు, పంజరం లోంచి ఇనుప కడ్డీలకేవో కబుర్లు చెబుతున్న రెక్కల అస్వేచ్ఛ కొలిచి కొలిచి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిటుకు చిటుకుమని ఒహటే చప్పుడు, పంజరం లోంచి

ఇనుప కడ్డీలకేవో కబుర్లు చెబుతున్న రెక్కల అస్వేచ్ఛ

కొలిచి కొలిచి ఒక్కో అడుగు వేస్తున్న జురాసిక్‌ మనిషి

ఒక్కో పాదాన్ని తీసి తనలో కలుపుకుంటూ ఒక పద్యం,

ఇదిగో ఇటే వెళ్లింది, తిరిగి వస్తుందో, ఇక ఎన్నటికీ రాదో

ఇప్పుడు ఇదా? ఇది పద్యం కాదు, పద్యం తిరిగివస్తే, వచ్చిన

సాయంత్రం తీరిగ్గా కూచుని అది రాసుకోబోతున్న ట్రావెలోగ్‌

అప్పటికైనా


తీరిక వేదికమీద ఆసీనమైన పద్యం తన రచనను తను ఆనందిస్తుందా?

చేయడానికి పనిలేని చేతులను అప్పుడు నేనేం చేసుకుంటానో ఏమో?!

నాలో రగులుతున్నదేమిటో ఇప్పుడు చెప్పలేను, నాకు తెలీదు కూడా

చూడు చూడు, సూర్యుడిలో జలకాలాడే పొద్దుతిరుగుడుపువ్వుల చేనిలా

బాంబుల వానలో స్నానం చేస్తున్న యుక్రెయిన్‌, తన

స్నానానికి నెమ్మదిగా బట్టలు విప్పకుంటున్న తైవాన్‌

పంజరం తయారైంది వేడికి కరిగిపోయే ఇనుప కడ్డీలతో కాదు

ఇది రక్తమాంసాలతో అతికించబడిన గట్టి ఎముకల పంజరం

అమ్మా, చిలుకమ్మా! నువ్వు పక్షివి కాదు, మానవజాతి కోరికవి

నీకు విముక్తి ఉన్నదా? విముక్తి కావాలనే కోరికకు విముక్తి ఉన్నదా?

హెచ్చార్కె

+1(609)6472863

Updated Date - 2022-08-08T05:49:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising