ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైస్‌ ఛైర్మన్‌ అభ్యర్థిని కిడ్నాప్‌

ABN, First Publish Date - 2022-03-05T16:22:45+05:30

తిరువళ్లూర్‌ జిల్లా చోళవరం యూనియన్‌ ఆరణి నగర పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ మంది గెలుపొందారు. నగర పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                  - ఆరణిలో ఉద్రిక్తత


గుమ్మిడిపూండి(చెన్నై): తిరువళ్లూర్‌ జిల్లా చోళవరం యూనియన్‌ ఆరణి నగర పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ మంది గెలుపొందారు. నగర పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఛైర్మన్‌గా రాజేశ్వరి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వైస్‌ ఛైర్మన్‌గా 3వ వార్డు నుంచి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి ప్రభావతి నామినేషన్‌ వేశారు.. మధ్యాహ్నం జరగాల్సిన ఈ ఎన్నిక కోసం ఆమె కార్యాలయం ముందు నిలబడి ఉండగా, కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. ఊహించని ఈ పరిణామానికి దిగ్ర్భాంతి చెందిన ఆమె కుటుంసభ్యులు, బంధువులు పంచాయతీ కార్యాలయం ముందు భైఠాయించి ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన పోలీసులు కౌన్సిలర్‌ ప్రభావతి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీయగా, భారీగా పోలీసులు మోహరించారు.

Updated Date - 2022-03-05T16:22:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising