ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్లు కూలి ఇద్దరు విద్యార్థుల మృతి

ABN, First Publish Date - 2022-01-28T15:00:36+05:30

కడలూరు సమీపంలో శిధిలావస్థకు చేరిన ఇళ్లు కూలిన ఘటనలో ఇద్దరు ప్లస్‌ టూ విద్యార్థులు మృతిచెందిన ఘటన విషా దానికి దారితీసింది. ఎస్‌.పుదూర్‌ వండికుప్పం సమత్తువపురంలో 2013లో శ్రీలంక శరణార్ధు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): కడలూరు సమీపంలో శిధిలావస్థకు చేరిన ఇళ్లు కూలిన ఘటనలో ఇద్దరు ప్లస్‌ టూ విద్యార్థులు మృతిచెందిన ఘటన విషా దానికి దారితీసింది. ఎస్‌.పుదూర్‌ వండికుప్పం సమత్తువపురంలో 2013లో శ్రీలంక శరణార్ధుల కోసం కట్టిన ఇళ్లలో ప్రస్తుతం ఎవరూ లేక శిధిలా వస్థకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, బుధవారం ఉదయం ఓ ఇంటి సమీపంలో వీరశేఖర్‌ (16), సుధీష్‌కుమార్‌ (16), భువనేశ్వరన్‌ (16) సహా మరికొందరు విద్యార్థులు ఆడుకుంటున్నారు. అంతలో ఊహించని విధంగా ఇళ్లు కూలిపడడంతో ముగ్గురు శిధిలాల కింద చిక్కుకు పోయారు. చుట్టు పక్కల వారు అక్కడకు చేరుకొని శిధిలాలు తొలగించి చూడగా, వీరశేఖర్‌, సుధీష్‌కుమార్‌ మృతిచెందగా, భువనేశ్వరన్‌కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమ్తితం కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కడలూరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు: సీఎం

కడలూరు ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన వీరశేఖర్‌, సుధీష్‌కుమార్‌ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపడంతో పాటు వారికి తలా రూ.2 లక్షలు, గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భువనేశ్వరన్‌కు రూ.50 వేలు సాయం అందజేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

Updated Date - 2022-01-28T15:00:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising