ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan: హోటల్‌లో యూఎస్ మహిళపై సామూహిక అత్యాచారం

ABN, First Publish Date - 2022-07-20T15:30:23+05:30

పాకిస్థాన్ దేశంలో మరో దారుణం జరిగింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 లాహోర్ (పాకిస్థాన్): పాకిస్థాన్ దేశంలో మరో దారుణం జరిగింది. 21 ఏళ్ల అమెరికా మహిళపై (US Woman) పాకిస్థాన్(Pakistan) హోటల్‌లో (Hotel) సామూహిక అత్యాచారం జరిగింది.పాకిస్థాన్‌ దేశానికి టూరిస్ట్ వీసాపై( tourist visa) వచ్చిన అమెరికా మహిళ గత ఏడు నెలలుగా ఆ దేశంలో నివసిస్తున్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లో 21 ఏళ్ల అమెరికన్ యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పాక్ పోలీసులు తెలిపారు.డి.జి.కి చెందిన హిల్ స్టేషన్ ఫోర్ట్ మన్రోలోని ఒక హోటల్‌లో ఈ సంఘటన జరిగింది. అమెరికన్ అమ్మాయి తన సోషల్ మీడియా స్నేహితురాలు ముజ్మల్ సిప్రా ఆహ్వానంపై కరాచీ నుంచి ఫోర్ట్ మన్రోకి వచ్చింది.


 ‘‘మేం ఫోర్ట్ మన్రోలోని ఒక హోటల్‌లో బస చేశాం, అక్కడ ఇద్దరు నిందితులు నాపై సామూహిక అత్యాచారం చేశారు నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి వీడియో కూడా తీశారు’’ అని అమెరికా మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది.పాక్ బోర్డర్ మిలిటరీ పోలీసులు ఇప్పటికే సిప్రాను అరెస్టు చేశారు. పాకిస్థాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376, 292 బి కింద నమోదు చేసిన కేసులో పేర్కొన్న మరో నిందితుడిని అరెస్టు చేయడానికి పోలీసులు గాలిస్తున్నారు.పాక్ పోలీసులు బాధిత మహిళకు మెడికో-లీగల్ టెస్ట్ కూడా చేశారు.


పంజాబ్ ముఖ్యమంత్రి(chief minister) హమ్జా షెహబాజ్ ఈ ఘటనపై దృష్టి సారించారు. ఈ అత్యాచారం కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని పంజాబ్ పోలీసు చీఫ్‌ను పంజాబ్ సీఎం హమ్జా ఆదేశించారు.నిందితులకు చట్ట ప్రకారం శిక్షలు తప్పవని, బాధితురాలికి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హమ్జా చెప్పారు.


Updated Date - 2022-07-20T15:30:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising