ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Uttar Pradesh: రీల్స్ సరదా ప్రాణాలు తీసింది

ABN, First Publish Date - 2022-12-15T13:51:35+05:30

ఎక్కడ పడితే అక్కడ వీడియోలు రికార్డు చేయడం.. వాటిని సోషల్ మీడియాల్లో పోస్ట్ చేయడం. ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఎక్కడ పడితే అక్కడ వీడియోలు రికార్డు చేయడం.. వాటిని సోషల్ మీడియాల్లో పోస్ట్ చేయడం. ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా(Social Media)లో ఫేమ్ అయ్యేందుకు ప్రయత్నించి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ఘజియాబాద్‌లో కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ముస్సోరీకి చెందిన నదీమ్, షకీల్ ఇద్దరూ స్నేహితులు. ఇద్దరూ ట్యాక్స్ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఈ నదీమ్‌కు జానైబీ అనే యువతితో వివాహం జరగగా.. షకీల్‌కు ఇంకా పెళ్లి కాలేదు. కాగా.. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో షకీల్ సహా నదీమ్ దంపతులు కాలక్షేపం కోసం కలిసి బయటికెళ్లారు. ఈ నేపథ్యంలోనే దస్నా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై నిల్చుని సోషల్ మీడియా‌లో అప్‌లోడ్ చేయడానికి రీల్స్ క్రియేట్(Reels Shooting) చేస్తుండగా.. అటువైపుగా వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు వాళ్లను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నదీమ్ దంపతులు సహా షకీల్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Updated Date - 2022-12-15T13:52:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising